విజయవాడలో ఐటీ అధికారుల మెరుపు దాడులు

ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ఐటి రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో కోట్ల రూపాయల్లో ఆదాయం ఉన్నప్పటికీ పన్ను చెల్లించే సమయానికి తక్కువగా చూపుతున్నట్లు ఐటీ అధికారులు పరిశీలనలో తేలింది.

news18-telugu
Updated: February 26, 2020, 9:07 AM IST
విజయవాడలో ఐటీ అధికారుల మెరుపు దాడులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజయవాడలో ఇన్‌కం టాక్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపుతున్న డాక్టర్ల పై కొరడా ఝులిపించారు.ఐటీ అధికారులు తనిఖీలతో రాష్ట్రంలో ఒక్కసారిగా కార్పోరేట్ ఆసుపత్రి యాజమాన్యాలు, డాక్టర్లు ఉలిక్కి పడ్డారు.ఆదాయం కోట్లలో ఉన్నప్పటికీ ఆదాయపన్ను శాఖకు మాత్రం పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై ఐటీ అధికారులు నిఘా పెట్టారు.విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన అన్ని ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ఐటి రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో కోట్ల రూపాయల్లో ఆదాయం ఉన్నప్పటికీ పన్ను చెల్లించే సమయానికి తక్కువగా చూపుతున్నట్లు ఐటీ అధికారులు పరిశీలనలో తేలింది. ఇవాళ ఉదయం నుంచి పది మందికి పైగా ఐటీ అధికారులు రోగులకు ఇబ్బంది కలగకుండా ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముందు ముందు రిటర్న్స్ దాఖలు చేయని ఆసుపత్రుల్లో కూడా త్వరలో దాడులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు