ఐసిస్ ఛీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతం

ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన సీక్రెట్‌ ఆపరేషన్లో యూఎస్‌ ఆర్మీ..అబుబకర్‌ను హతమార్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

news18-telugu
Updated: October 27, 2019, 10:48 AM IST
ఐసిస్ ఛీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతం
ఐసిస్ ఛీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతం
  • Share this:
ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాద సంస్థ అగ్ర నాయకుడు అబు బకర్‌ ఆల్‌ బగ్దాదీ హతమయ్యాడు. అమెరికా సైన్యం జరిపిన ఓ రహస్య ఆపరేషన్‌లో బాగ్దాదీని మట్టుబెట్టినట్లు సమాచారం. ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన సీక్రెట్‌ ఆపరేషన్లో యూఎస్‌ ఆర్మీ..అబుబకర్‌ను హతమార్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 'న్యూస్‌ వీక్‌' అనే పత్రిక దీనిపై కథనం రాసింది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు వైట్‌ హౌస్‌కు కూడా అందించారు. అబు బకర్‌ను మట్టుబెట్టడానికి అత్యున్నత స్థాయిలో వ్యూహరచన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ను వారం క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఆమోదించారని కథనంలో తెలిపింది. తాజాగా ట్రంప్‌ 'ఇప్పుడే ఒక పెద్ద ఘటన జరిగింది' అని ట్విటర్‌లో పేర్కొనడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది.
First published: October 27, 2019, 10:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading