కన్నకూతురికి స్కూల్ ఫీజు కట్టడానికి చిర్రెత్తుకొచ్చిన ఓ తండ్రి సొంత కూతురినే చంపేశాడు. హర్యానాలోని కురుక్షేత్ర సమీపంలోని దబ్ఖేరా గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ విషయాన్ని బాలిక తల్లి హర్జీందర్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాద్వా ఇన్స్పెక్టర్ ఓమ్ ప్రకాష్ చెప్పిన వివరాల ప్రకారం.. దబ్ఖేరా గ్రామంలో జస్బీర్ సింగ్, అతడి భార్య హర్జీందర్ కౌర్, ఆరేళ్ల కుమార్తెతో కలసి నివసిస్తున్నారు. సింగ్ రోజువారి కూలిపనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు స్కూల్ ఫీజుకు సంబంధించి అతడిని డబ్బులు అడిగిన ప్రతిసారీ విసుక్కునేవాడు. ఈ క్రమంలో తాజాగా కుమార్తె స్కూల్ ఫీజుకు సంబంధించి గొడవ జరిగింది. దీంతో ఏకంగా కూతుర్ని చంపేశాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.