కోరిక తీర్చలేదన్న కసి.. పోర్న్ సైట్‌లో అమ్మాయి ఫోన్ నెంబర్..

(ప్రతీకాత్మక చిత్రం)

తన కోరిక తీర్చలేదన్న కసితో ఆ అమ్మాయి ఫోన్ నెంబర్‌ను ఓ పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఓ నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి, ఓ మార్ఫింగ్ ఫొటోను తగిలించాడు.

  • Share this:
    ఓ యువతి తనతో శృంగారానికి నో చెప్పిందన్న అక్కసుతో ఓ యువకుడు ఆమె ఫోన్ నెంబర్‌ను పోర్న్ సైట్స్‌లో అప్‌లోడ్ చేశాడు. ఎవరెవరి నుంచో తన మొబైల్ ఫోన్‌కు అసభ్య సందేశాలు, ఫోన్లు రావడంతో ఆమె విసిగిపోయి చివరకు పోలీసులను ఆశ్రయించింది. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న యువతికి, ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మొహమ్మద్ ముదాసిర్‌తో పరిచయం ఏర్పడింది. అయితే, అతడి అతి ప్రవర్తన, ఓవర్ యాక్షన్ నచ్చకపోవడంతో అతడిని దూరం పెట్టింది. అయితే, తన కోరిక తీర్చలేదన్న కసితో ఆ అమ్మాయి ఫోన్ నెంబర్‌ను ఓ పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఓ నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి, ఓ మార్ఫింగ్ ఫొటోను తగిలించాడు. అక్కడ ఆమె నెంబర్ పోస్ట్ చేశాడు. దీంతో ఆమెకు కొందరి నుంచి ఫోన్లు రావడం, మెసేజ్‌లు రావడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మొహమ్మద్ ముదాసిర్‌ను అరెస్ట్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: