బర్రె గురించి గొడవ... గొడ్డలితో భార్య కాళ్లు నరికిన భర్త... కృష్ణాజిల్లాలో దారుణం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో వెలుగుచూసిన దారుణం... గేదె అమ్మకం గురించి భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ... గొడ్డలి తీసుకుని భార్య కాళ్లు నరికిన భర్త...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 14, 2019, 8:37 PM IST
బర్రె గురించి గొడవ... గొడ్డలితో భార్య కాళ్లు నరికిన భర్త... కృష్ణాజిల్లాలో దారుణం...
గొడ్డలి (నమూనా చిత్రం)
  • Share this:
బర్రె అమ్మకం గురించి మొదలైన ఓ చిన్నగొడవ... భార్య కాళ్లు పోవడానికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ దారుణం స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది. కృష్ణా జిల్లాలోని లింగాల పాడు గ్రామానికి చెందిన జి పిచ్చయ్య అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న గేదెను అమ్మేసి,ఇంటికి వచ్చాడు. అయితే పాలు ఇచ్చే గేదెను అమ్మడం ఇష్టం లేని అతని భార్య రాజేశ్వరి, పిచ్చయ్యతో గొడవకు దిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. దాంతో ఆవేశానికి లోనైన పిచ్చయ్య... గొడ్డలి తీసుకుని భార్య రెండు కాళ్లు నరికాడు. ఆమె అరుపులు విని లేచి వచ్చిన ఆమె కూతురు... చుట్టుపక్కలవారిని పిలిచింది. అక్కడికి చేరుకున్న గ్రామస్థులు... పిచ్చయ్యను ఆపి, గాయపడిన రాజేశ్వరిని ఆసుపత్రికి తరలించారు.

పిచ్చయ్య దాడిలో రాజేశ్వరి కాళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయని, తిరిగి ఇంతకుముందులా నడవలేదని తేల్చారు వైద్యులు. అయితే భార్యాభార్తల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. కీసర‌లో ఉన్న తన తమ్ముడి దగ్గరికి వెళ్లాలని రాజేశ్వరి పట్టుబడడం, దానికి పిచ్చయ్య ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కొట్టుకున్నారని... ఆ తర్వాత బర్రె విషయమై జరిగిన గొడవతో తండ్రి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని వారి కూతురు పోలీసులకు తెలిపింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... పిచ్చయ్యను అదుపులోకి తీసుకున్నారు. కొసమెరుపు ఏంటంటే... భార్య కాళ్లు నరకాలని ముందే ఫిక్స్ అయిన పిచ్చయ్య, గొడ్డలి భార్యకు ఇచ్చి శుభ్రంగా కడగమని చెప్పాడట. తన కాళ్లు నరకడానికి గొడ్డలి వాడబోతున్నాడనే విషయం తెలియక భర్త చెప్పిన పనిని రాజేశ్వరి తూ.చ తప్పకుండా చేసిందట.

First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading