Home /News /crime /

IPS OFFICER VARTIKA KATIYAR FILES DOWRY HARASSMENT CASE AGAINST HER HUSBAND IN BANGALORE HSN

ఐపీఎస్ ఆఫీసర్ కు కూడా తప్పని అదనపు కట్నం వేధింపులు.. ఆ భర్త మామూలోడు కాదండోయ్..!

ఐపీఎస్ అధికారి వర్తికా కటియార్

ఐపీఎస్ అధికారి వర్తికా కటియార్

ఓ మహిళా ఐపీఎస్ అధికారి తన భర్తపై కేసు పెట్టింది. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. ఆ భర్త కూడా ఐఎఫ్ఎస్ అధికారి కావడం గమనార్హం. ఇద్దరూ పెద్ద పెద్ద స్థాయి ఉద్యోగాల్లో ఉన్న, భర్త నిర్వాకం గురించి తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
    డబ్బున్న వాళ్లకు, పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వాళ్లకు ఏం కష్టాలు ఉంటాయిలే అని అందరూ అనుకుంటుంటారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ల గురించి అయితే వేరే చెప్పనవసరం లేదు. సాధారణ ఇళ్లల్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలు, మహిళలపై అదనపు కట్నం వేధింపులు వంటివి అసలే ఉండవు అని అంతా భావిస్తుంటారు. కానీ అక్కడే అంతా పొరపాటు చేసేది. మహిళలపై అదనపు కట్నం వేధింపులు అనేవి స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నా, వారు ఏకంగా పోలీస్ ఉద్యోగాల్లో ఉన్నా తప్పవన్నది నిరూపణ అయింది. తాజాగా ఓ మహిళా ఐపీఎస్ అధికారి తన భర్తపై కేసు పెట్టింది. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. ఆ భర్త కూడా ఐఎఫ్ఎస్ అధికారి కావడం గమనార్హం. ఇద్దరూ పెద్ద పెద్ద స్థాయి ఉద్యోగాల్లో ఉన్న, భర్త నిర్వాకం గురించి తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వర్తికా కటియార్ 2009 బ్యాచ్ లో ఐపీఎస్ కు సెలెక్టయ్యారు. ఆమె ప్రస్తుతం బెంగళూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు 2011లో వివాహం అయింది. అమె భర్త పేరు నితిన్ సుభాష్. ఆయన భారతీయ విదేశాంగ సర్వీసు (ఐఎఫ్ఎస్) అధికారి. ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో నితిన్ పనిచేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చాలా కాలం పాటు ఓపిక పట్టిన వర్తికా కటియార్, ఇక తప్పదని భర్తపై బెంగళూరు కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

    ’నా భర్త మద్యానికి బానిసయ్యాడు. ధూమపానం వంటి చెడు అలవాట్లను కొత్తగా నేర్చుకున్నాడు. వీటికి దూరంగా ఉండాలని నేను ఎన్నోసార్లు చెప్పా. అయినా వినకుండా నాపై దాడి చేసేవాడు. 2016వ సంవత్సరంలో ఈ విషయమై మా మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో నాపై దాడి చేసి నా చెయ్యి విరిచాడు. గతేడాది దీపావళికి అత్తారింటి నుంచి కానుక రాలేదంటూ గొడవకు దిగాడు. విడాకులు ఇస్తానని బెదిరించాడు. మా అమ్మమ్మ వద్ద 5 లక్షలు తీసుకున్నాడు. ఇల్లు కొంటానని చెప్పి మా అమ్మానాన్న దగ్గర నుంచి 35 లక్షలు తీసుకున్నాడు. ఇంకా అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడు‘ అని వర్తికా కటియార్, తన భర్త నితిన్ సుభాష్ పై విచారణ చేసింది. దీంతో నితిన్ సహా అతడి కుటుంబసభ్యులు మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Husband kill wife, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు