హోమ్ /వార్తలు /క్రైమ్ /

IPL Betting : కూతురి పెళ్లి అప్పు తీర్చడం కోసం ఐపీఎల్ లో బెట్టింగ్ చేసిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

IPL Betting : కూతురి పెళ్లి అప్పు తీర్చడం కోసం ఐపీఎల్ లో బెట్టింగ్ చేసిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఐపీఎల్ బెట్టింగ్ (ప్రతీకాత్మక చిత్రం)

ఐపీఎల్ బెట్టింగ్ (ప్రతీకాత్మక చిత్రం)

IPL Betting : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంట్రీతో దేశంలో బెట్టింగ్ Betting) మాఫియా పెరిగిపోయింది. సీజన్ సీజన్ కు బెట్టింగ్ చేసే వారు ఎక్కువ అవుతున్నారు. 3 గంటల వ్యవధిలో  డబ్బులు సంపాదించొచ్చనే ఉద్దేశంతో చాలా మంది యువత బెట్టింగ్ వైపు ఆకర్షితులై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...

IPL Betting : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంట్రీతో దేశంలో బెట్టింగ్ Betting) మాఫియా పెరిగిపోయింది. సీజన్ సీజన్ కు బెట్టింగ్ చేసే వారు ఎక్కువ అవుతున్నారు. 3 గంటల వ్యవధిలో  డబ్బులు సంపాదించొచ్చనే ఉద్దేశంతో చాలా మంది యువత బెట్టింగ్ వైపు ఆకర్షితులై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లోనూ దేశంలో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. కొందరు బుకీలను ట్రేస్ చేసిన పోలీసులు వారిని అరెస్టు కూడా చేశారు. అయితే తాజాగా ఒడిశా (Odisha)లో ఓ బెట్టింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చాలనే ఆశతో ఐపీఎల్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయిన తల్లీ కొడుకు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని రాయ్ గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి : ’అతడో తాగుబోతు.. అలా చేసినందుకు జట్టు నుంచి గెంటేశాం‘ వార్నర్ పై టీమిండియా లెజెండ్ షాకింగ్ కామెంట్స్

పోలీసుల వివరాల ప్రకారం.. నాలుగేళ్ల క్రితం కూతురి పెళ్లి కోసం ఓ తల్లి (పేరు వెల్లడించలేదు) కొందరి దగ్గర నుంచి అప్ప్పు చేసింది. అయితే అప్పు ఇచ్చిన వారు తమ డబ్బులు కట్టాలంటూ ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. దాంతో ఆమె తన 22 ఏళ్ల కొడుకుతో కలిసి ఐపీఎల్ లో బెట్టింగ్ చేసి డబ్బులు సంపాదించాలని భావించారు. అందుకోసం మరోసారి అప్పు చేసింది. ఇక బెట్టింగ్ లో ఆ మొత్తాన్ని వారు పోగొట్టుకున్నారు. ఇక అప్పు ఇచ్చిన వారి నుంచి రోజు రోజుకు ఒత్తిడి ఎక్కువ అవుతుండటంతో శుక్రవారం రాత్రి ఇద్దరు ఆహారంలో విషం కలుపుకుని తిన్నారని పోలీసులు వివరించారు. అయితే చుట్టుపక్కల వారు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని హాస్పిటల్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం ఉదయం మొదటి కుమారుడు చనిపోగా.. కొన్ని గంటల వ్యవధిలో తల్లి కూడా మరణించింది. ప్రస్తుతం దీనిని కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి : వారెవ్వా బట్లర్ నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా..! చహల్ తో కలిసి..

ఇక చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారం ప్రకారం.. అప్పు తీర్చాలంటూ అప్పు ఇచ్చిన వారు ప్రతిరోజు మృతురాలు ఇంటి ముందు న్యూసెన్స్ చేసేవారని పేర్కొన్నారు. ఒకరోజు ఆమె ఇంటిలోని ఫ్రిడ్జ్, ఇన్వర్టర్ లాంటి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు కూడా పేర్కొన్నారు. దాంతో మృతురాలు మూడు రోజుల పాటు ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టలేదని వారు తెలిపారు.

First published:

Tags: Betting, Crime, Crime news, Crime story, IPL, IPL 2022, Mother suicide with her childrens, Odisha, Suicide

ఉత్తమ కథలు