ఓయూ లేడీస్ హాస్టల్‌లో కలకలం.. కత్తితో దూసుకొచ్చిన అగంతకుడు

విద్యార్థిని వాష్‌రూమ్ వెళ్లడం గమనించి.. అగంతకుడు చెట్టుపై నుంచి హాస్టల్ లోపలికి దూకేశాడు. వాష్‌రూమ్‌లో ఉన్న విద్యార్థినికి బయట ఎవరో మగ వ్యక్తి మాటలు వినిపించాయి.దాంతో భయపడి వాష్‌రూమ్‌లోనే ఉండిపోయింది. కానీ ఆ అగంతకుడు..

news18-telugu
Updated: August 16, 2019, 8:45 AM IST
ఓయూ లేడీస్ హాస్టల్‌లో కలకలం.. కత్తితో దూసుకొచ్చిన అగంతకుడు
ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్ తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో శుక్రవారం తెల్లవారుజాము 3గంటల ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.ఇంజనీరింగ్ లేడీస్ హాస్టల్ గోడ దూకి లోపలికి చొరబడ్డ ఓ అగంతకుడు కత్తితో ఓ విద్యార్థినిని బెదిరించి అసభ్యంగా ప్రవర్తించాడు.భయపడ్డ విద్యార్థిని గట్టిగా కేకలు వేయడంతో.. అగంతకుడు అక్కడినుంచి పారిపోయాడు. అయితే ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను అతను లాక్కెళ్లినట్టు సమాచారం. ఘటనపై తార్నాక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఇంజనీరింగ్ లేడీస్ హాస్టల్ వెనుక భాగంలో కాంపౌండ్ వాల్‌ను ఆనుకుని ఓ చెట్టు ఉంది.తెల్లవారుజాము 3గంటల సమయంలో ఓ విద్యార్థిని వాష్‌రూమ్ వెళ్లింది. విద్యార్థిని వాష్‌రూమ్ వెళ్లడం గమనించి.. అగంతకుడు చెట్టుపై నుంచి హాస్టల్ లోపలికి దూకేశాడు. వాష్‌రూమ్‌లో ఉన్న విద్యార్థినికి బయట ఎవరో మగ వ్యక్తి మాటలు వినిపించాయి.దాంతో భయపడి వాష్‌రూమ్‌లోనే ఉండిపోయింది. కానీ ఆ అగంతకుడు కత్తితో బెదిరించి ఆమెను బయటకు రప్పించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో..విద్యార్థిని గట్టిగా కేకలు పెట్టింది.దీంతో తోటి విద్యార్థినులంతా అక్కడికి పరిగెత్తుకొచ్చారు. దీంతో నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. అయితే పరారయ్యే సమయంలో విద్యార్థిని చేతిలోని సెల్‌ఫోన్ లాక్కెళ్లాడు. అయితే పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న క్రమంలో.. కాంపౌండ్ వాల్ సమీపంలో ఆ సెల్‌ఫోన్ పగిలిపోయి కనిపించింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.



First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...