Home /News /crime /

Red Sandalwood Smuggler: పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ రెడ్ స్మగ్లర్.. ఎలా చిక్కాడంటే..?

Red Sandalwood Smuggler: పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ రెడ్ స్మగ్లర్.. ఎలా చిక్కాడంటే..?

మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ అరెస్ట్

మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ అరెస్ట్

Red Smuggler Arrest: గత కొన్నేళ్లుగా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లు.. ఎక్కడ నుంచి వస్తారో..? ఎలా తప్పించుకుని పోతారో తెలీదు.. కానీ పోలీసులకు మాత్రం చిక్కారు. దీంతో వారి ఆటకట్డించడంపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. వరుసగా రెడ్‌ స్మగ్లర్స్‌ని అరెస్టు చేస్తు వారి ద్వారా గ్యాంగ్ లీడర్ల గుట్టు లాగి.. చివరకు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ రామనాథరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇంకా చదవండి ...
    కRed Sandalwood Smuggler Arrest: ఎర్రచందనం స్మగ్లింగ్  (Red Sandalwood Smuggling) లో ఆరి తేరి.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న.. మోస్ట్ వాంటెడ్ (Most Wanted) ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. గత కొన్ని నెలలుగా ఎర్రచందనం స్మగ్లర్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వరుసగా రెడ్‌ స్మగ్లర్స్‌ని అరెస్టులు (Red smugglers arrests) చేస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం గ్యాంగ్ లీడర్లపై కన్నేసి ఉంచారు. ఇందులో భాగంగా తాజాగా అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్‌ రామనాథరెడ్డిని (International red sandalwood smuggler ramanathreddy) పోలీసులు అరెస్టు చేశారు. కుప్పం-కృష్ణగిరి హైవే (Kuppam-krishnagiri highway)లో పెద్ద మొత్తంలో ఎర్ర చందనాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు రామనాథరెడ్డి. కొంతకాలంగా రామనాథరెడ్డిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అతడి అనుచరులపై సైతం ఓ కన్నేసిన ఖాకీలు..అదనుకోసం వెయిట్‌ చేశారు. ఈ తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్నారనే పక్కా సమాచారంతో జాతీయ రహదారిపై నిఘా ఉంచారు. ఓ వాహనంలో సుమారు 50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రామనాథరెడ్డితోపాటు ముగ్గురు అనుచరులను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి అనుకున్నారు. దీనికి సహకరిస్తున్న వారు ఎవరు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

    ఎర్ర చందనం దొంగలకు స్థానికుల సహకారం ఉంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు పైసలు చేతికి అందడంతో ఎవరికి తోచిన రీతిలో వారు సాయం చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి సహకారంతోనే విలువైన ఎర్ర చందనం సరిహద్దులు దాటుతున్నాయి. ఎవరికీ తెలియకుండా ఎలా అనుమానం రాకుండా గుట్టుగా కలపను రవాణా చేస్తున్నారు. స్థానిక నేతలు కొందరు స్మగ్లర్లకు సహకరించడం వల్ల కఠిన చర్యలు తీసుకుంటున్నా అడపాదడపా ఎర్రచందనం తరలుతూనే ఉంది.

    ఇదీ చదవండి: ఏపీ అప్పులు 6 లక్షల కోట్లు.. ఇలా అయితే కష్టమే..? జగన్ సర్కార్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

    ఇప్పటికే ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నప్పటికీ వారి కళ్లుగప్పి కలపను తరలిస్తున్నారు. ఎర్రకూలీల తరలింపులో డ్రైవర్ల పాత్రపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. మరికొందరి పాత్రపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉందన్నారు. తమిళ కూలీలకు సహకరిస్తే కాసులపంట పండిరచుకునే అవకాశం ఉండటంతో డ్రైవర్లు కక్కుర్తిపడినట్లు తెలుస్తోంది.

    ఇదీ చదవండి: సెంటు భూమిలో ఇళ్లా..? నిర్మాణాలు చేపట్టవద్దన్న కోర్టు.. జగన్ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్

    జాతీయ రహాదారిపై నిఘా పెట్టి 12 టైర్ ల లారీలో తరలిస్తున్న 62 ఎర్ర చందనం దుంగలను… వాటికి ఎస్కార్ట్ గా స్కార్పియో వాహనంలో అనుచరులతో వెళుతున్న స్మగ్లర్ రామనాథ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఇదీ చదవండి: నలుగురూ అమ్మాయిలే.. అబ్బాయి కావాలనుకున్నారు.. చివరికి పోలీసులకు చిక్కారు

    రామనాథరెడ్డిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని .. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లలో రామనాథరెడ్డి ఒకడని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసు కొన్న ఎర్రచందనం దుంగలు మరియు వాహనాల విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Kadapa, Smuggling

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు