Home /News /crime /

INTERNATIONAL NEWS SHOCKING ROAD ACCIDENT IN USA CAR FLIES OVER ANOTHER CAR AT TRAFFIC SIGNAL NGS

Shocking Accident: షాకింగ్ కార్ యాక్సిడెంట్.. ఇప్పటి వరకు ఇలాంటిది చూసి ఉండరేమో.. ఆరు వాహనాలపై ఎఫెక్ట్..

షాకింగ్ కార్ యాక్సిడెంట్

షాకింగ్ కార్ యాక్సిడెంట్

Shocking Accident: కొన్ని విషయాలు చెబితే నమ్మం లేం.. నిజంగా కళ్లతో చూసినా షాక్ అవుతాం.. అలాంటి షాకింగ్ యాక్సిడెంట్ వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఇలాంటి యాక్సిడెంట్ చూసి ఉండరేమో..?

    Shocking Accident effected six vehicles: రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ఇటీవల పెరుగుతూ ఉన్నాయి. ఆ దేశం ఈ దేశం అని కాకుండా ప్రమాదాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) కఠినంగా అమలు చేసే దేశాల్లో సైతం యాక్సిడెంట్లు భయపెడుతున్నాయి. రోడ్డు మీద డ్రైవింగ్ చేసే సమయంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఒక్కోసారి యాక్సిడెంట్లు జ‌రుగుతూనే ఉంటాయి. అయితే అందులో కొన్ని ప్ర‌మాదాలు చాలా విచిత్రంగా జ‌రుగుతుంటాయి. ఊహకందని రీతిలో, రెప్పపాటులో జరిగిపోతాయి. అంతేకాదు ప్ర‌మాదంతో ఎలాంటి సంబంధం లేని వారు బలి అవుతారు. ఏ పాపం తెలియకపోయినా వారి వాహనాలు సైతం డ్యామేజ్ (Vehicale damge) అవుతుంటాయి. తాజాగా జరిగిన ఓ యాక్సిడెంట్ (Accident) అలాంటిదే.. ఆ వీడియో చూసిన వారంతా కచ్చితంగా షాక్ కు గురి అవ్వాల్సి ఉంటుంది.

    ఆ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రమాదం జరిగిన తీరు ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది. ఇలాంటి యాక్సిడెంట్‌ను బ‌హుశా ఎప్పుడూ చూసి ఉండ‌ర‌ని అనుకోవ‌చ్చు.  అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇండియానాపోలిస్ లో గత నెలలో ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. అక్కడి రో్డ్లు ఖాళీగానే ఉన్నాయి. చాలామంది ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో అవుతున్నారు. అయితే ట్రాఫిక్ సిగ్న‌ల్‌ దగ్గర వేగంగా వ‌చ్చిన ఓ కారు మ‌రో కారును ఢీకొట్టింది. ఆ కారు వేగానికి ప్రమాదానికి గురైన కారు.. ఎగిరి అవ‌త‌ల ప‌డింది. అలా ఎగిరిపడిన కారు ఎక్కడో పడింది అనుకుంటే పొరపాటు..




    అలా ఎగిరిపడ్డ కారు.. కింద‌ప‌డ‌కుండా మ‌రో కారు ముందున్న బానెట్‌పై ప‌డింది. అయితే పాపం ఆ యాక్సిడెంట్ తో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ప్రమాదనికి గురైన కారు.. తన కారు పై పడడంతో.. పూర్తిగా ముందుభాగం దెబ్బతింది. కానీ కారులో వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.. వారంతా సురక్షితంగానే ఉన్నారు.

    ఇదీ చదవండి: మాజీ మిస్‌ కేరళ మృతి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు.. హోటల్ సీసీ ఫుటేజ్ ఏమైంది?

    అనూహ్యంగా జరిగిన ఈ ప్రమాదంలో ఆరు వాహనాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. మరింత ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. ఇంత ఘోర ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో కనీసం ఎవరికీ గాయాలు కూడా కాలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

    ఇదీ చదవండి: చీర కట్టులో చిల్ అవుతున్న మహానటి.. కుర్రాలను కైపెక్కిస్తున్న లేటస్ట్ పిక్స్

    ఈ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి లక్కీగా బయట పడ్డాడు.. అది వీడియో చూడొచ్చు. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందే ఆ వ్యక్తి రోడ్డు దాటుకుంటూ వెళ్తున్న సమయంలో కారు ఎగిరి వచ్చి పడింది. అది గమనించిన అతడు వెంటనే పక్కకి తప్పుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు భయపడి అక్కడే నిలబడినా.. కాస్త ఆలస్యంగా నడిచినా.. అతడి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండేది. అందుకే అతడు చాలా లక్కీ అని చెప్పాలి..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Car accident, Crime news, International news, Road accident, USA, World news

    తదుపరి వార్తలు