ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల సైబర్ నేరాలు (Cyber Crime) పెరిగిపోతున్నాయి. జనాన్ని తెలివిగా బురిడీకొట్టిస్తున్న కేటుగాళ్లు తెలియకుండానే వారి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల సైబర్ నేరాలు (Cyber Crime) పెరిగిపోతున్నాయి. జనాన్ని తెలివిగా బురిడీకొట్టిస్తున్న కేటుగాళ్లు తెలియకుండానే వారి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... సైబర్ నేరాల భారీన పడుతున్న వారిలో చదువురాని వారికంటే.., చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేస్తోన్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఎక్కువ డబ్బులు వస్తాయనో లేదా ఇతర ఆశలతో ఈ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు చాలా మంది. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాల బాధితుల్లో దాదాపు 70 శాతం మంది విద్యావంతులు టెక్నాలజీపై మంచి అవగాహాన ఉన్నవారే ఉండడం విశేషం. ఇలా వర్చువల్ మోసాలకు గురైన వారిలో కనీసం 30 నుండి 40 శాతం మంది గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని పోలీసులు తెలిపారు.
బాధితుల్లో 20 నుంచి 30 శాతం మంది ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. కేవలం 10 నుంచి 20 శాతం మంది బాధితులు మాత్రమే పదో తరగతిలో వరకు చదువుకున్న వారు ఉండడం విశేషం. సైబర్ నేరాలు బారిన ఎక్కువగా యువకులు టెక్నాలజీపై అవగాహాన ఉన్నవారే పడుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో బాధితులుగా మిగులుతున్నారు.
సైబర్ నేరగాళ్లు చుదువుకున్న వారైన వారిలో ఉన్న దురాశని ప్రధాన అస్త్రంగా చేసుకొని ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటారని ADCP (CCS), D శ్రావణ్ కుమార్ న్యూస్ 18 కి తెలిపారు. ఇలాంటి మోసాల్లో బాధితులుగా చాలా సందర్భాల్లో విద్యావంతులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువతి, యువకులు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
సైబర్ క్రూక్స్ 2021లో ఇంటి నుండి డబ్బు సంపాదించడం, తక్కువ సమయంలో మీకు ఎక్కువ రిట్నర్స్ అనే పేర్లతో సైబార్ నేరగాళ్లు ఎకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇదే కాకుండా మరికొన్ని ఇతర మార్గాల ద్వారా ఇప్పటి వరకు ఏపీలో దాదాపు రూ.9.3 కోట్లకు పైగా ఈ సైబర్ నేరగాళ్లు దోచుకున్నారంటే మీరు ఆశ్చరపోతారు. ఏపీలో ఒక్క వైజాగ్ నగరంలో సైబర్ నేరాల సంఖ్య 2021 నుండి 2020 వరకు 13.5 శాతం పెరిగింది. అయితే 2020తో పోలిస్తే 2021లో సైబర్ నేరగాళ్లు 50 శాతం ఎక్కువ డబ్బును వివిధ మార్గాలు, పద్దతుల ద్వారా దోచుకున్నారు.
కరోనా సమయం ఈ సైబర్ నేరగాళ్లకి చాలా అందివచ్చిన అవకాశంగా మారిందని అంటున్నారు పోలీసలు. ఏపీలో చాలా వరకు జరిగిన సైబర్ మోసాలు ఈ సమయంలోనే జరిగిటన్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఏపీలో సైబర్ మోసాలు ఎక్కువ అవుతుండడంతో పోలీసులు యువతకు అవగాహాన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. దురాశకు పోకుండా ఉండడం వలన మనం డబ్బు పోగొట్టుకోం అనే అంశాన్ని అర్ధమయ్యేలా చెబుతున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.