సైంటిస్ట్ సురేష్ హత్య : స్వలింగ సంపర్కమే అందుకు కారణమా..?

హత్యకు గురైన శాస్త్రవేత్త సురేష్

సురేష్ భార్య ఇందిర ప్రస్తుతం చెన్నైలో పనిచేస్తోంది. బదిలీపై 2005లో ఆమె అక్కడికి వెళ్లిపోవడంతో..సురేష్ ఒక్కడే నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు.

 • Share this:
  హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ధరమ్ కరమ్‌ రోడ్డులో సైంటిస్ట్ శ్రీధరన్ సురేష్ హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. సురేష్ హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన ఆనవాళ్లను బట్టి.. అతను స్వలింగ సంపర్కుడా(గే) అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వలింగ సంపర్కమే అతని హత్యకు దారి తీసి ఉంటుందా? అనుమానాలు బలపడుతున్నాయి. హత్య జరిగిన స్థలంలో సురేష్ ఒంటిపై దుస్తులు లేకపోవడం, ఘటనా స్థలంలో ఓ ఆయిల్ బాటిల్ లభించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

  పోలీసులు సీసీటీవి ఫుటేజీని పరిశీలించగా.. శ్రీనివాస్ అనే వ్యక్తి గత రెండు నెలలుగా సురేష్ ఫ్లాట్‌కి వచ్చి వెళ్తున్నట్టుగా గుర్తించారు. అమీర్‌పేట్‌లోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో అతను ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. దీంతో శ్రీనివాస్‌-సురేష్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీనివాసే హత్య చేశాడా..? లేక మరెవరి పాత్ర అయినా ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

  కాగా, సురేష్ భార్య ఇందిర ప్రస్తుతం చెన్నైలో పనిచేస్తోంది. బదిలీపై 2005లో ఆమె అక్కడికి వెళ్లిపోవడంతో..సురేష్ ఒక్కడే నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య చాన్నాళ్లుగా సత్సంబంధాలు లేవని తెలుస్తోంది.ఎప్పుడైనా అవసరమైతే మెసేజ్ చేయడమే తప్పించి.. ఫోన్ కూడా చేసేవాడు కాదని భార్య చెబుతున్నట్టు సమాచారం.దీంతో సురేష్‌ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్నది మిస్టరీగా మారింది.
  Published by:Srinivas Mittapalli
  First published: