హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime News : బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లాడు .. ఇంటర్‌ చదివే అమ్మాయిని వాడు ఏం చేశాడంటే

Crime News : బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లాడు .. ఇంటర్‌ చదివే అమ్మాయిని వాడు ఏం చేశాడంటే

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Crime news: హజీపూర్‌ తరహాలోనే వనపర్తి జిల్లాలో ఓ దారుణ సంఘటన జరిగింది. అయితే అక్కడ నిందితుడు అమ్మాయిలకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేసి చంపేశాడు. వనపర్తి జిల్లాలో మాత్రం నిందితుడు వేరే పద్దతిలో బ్లాక్ మెయిల్ చేశాడు.

ఆడపిల్లలు కనిపిస్తే కాటేసేందుకు కామాంధులు ఎక్కడ పడితే అక్కడ కాపు కాచుకొని కూర్చుంటున్నారు. స్కూల్‌(School)కి వెళ్తున్న పిల్లల దగ్గర నుంచి కాలేజీ (College)కి వెళ్తున్న అమ్మాయిల వరకు ఎవర్ని వదలడం లేదు. పరిచయాన్ని అడ్డుపెట్టుకొని అఘాయిత్యానికి పాల్పడుతుంటే ..సాయం చేస్తామనే పేరుతో ఇంకొందరు ఆడపిల్లల పాలిట రాక్షసుల్లా మారిపోతున్నారు. వనపర్తి(wanaparthy)జిల్లాలో ఇదే తరహా సంఘటన జరిగింది. ఇంటర్(inter)చదువుతున్న అమ్మాయిపై తన కామవాంఛ తీర్చుకున్న కిరాతకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు(Police) అతడ్ని అరెస్ట్ చేశారు.

ఇంటర్ స్టూడెంట్‌ అత్యాచారం..

వనపర్తి జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్ధిని బుక్స్ కొనుక్కునేందుకు తల్లి దగ్గరకు వెళ్తుండగా అత్యాచారానికి గురైంది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాధితురాలు ఈనెల 16వ తేదిన తల్లి పని చేస్తున్న దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకొని పుస్తకాలు కొనుక్కునేందుకు బయల్దేరింది. ఆటో కోసం ఎదురుచూస్తుండగా పరిచయమున్న వ్యక్తి బైక్‌పై బాధితురాలిని ఎక్కడికి వెళ్తుందో తెలుకున్నాడు. తాను కూడా అదే మార్గంలో వెళ్తున్నానంటూ బాలికకు అబద్దం చెప్పాడు. తన తల్లి పని చేస్తున్న చోటు దగ్గర దింపి వెళ్తానని చెప్పడంతో బాధితురాలు నమ్మింది. బైక్ ఎక్కిన ఇంటర్ స్టూడెంట్‌ని కామాంధుడు గ్రామానికి దూరంగా నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక అరిచేందుకు ప్రయత్నిస్తే చంపుతానంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై బలత్కారం చేసిన తర్వాత విషయం బయటపెడితే మీ కుటుంబం పరువు పోతుందని మానసికంగా బెదిరించాడు. అక్కడి నుంచి యువతిని బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టాడు.

లిఫ్ట్‌ పేరుతో మోసం..

ఈనెల 16వ తేదిన ఇంటర్ బాలిక కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురైంది. నిజం చెబితే పరువు పోతుందని భావించింది. అయితే కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని తెలియపర్చడంతో ఈ నెల 20న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల కంప్లైంట్ ఆధారంగా నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లుగా పట్టణ ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి తెలిపారు. ఇంటర్ స్టూడెంట్‌పై అత్యాచారనికి పాల్పడిన నిందితుడ్ని అరెస్ట్ చేసి..ఆదివారం రిమాండ్‌కు తరలించారు.

Telangana : ఓ ఫ్యామిలీని టార్చర్ పెట్టిన అన్నదమ్ములు .. భరించలేక భార్య, బిడ్డలతో ఏం చేశాడంటే ..?



హాజీపూర్‌ తరహా ఘటనేనా ...

ఆ మధ్య యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్‌లో సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి తరహాలోనే ఈ కామాంధుడు గతంలో ఇదే విధంగా వేరే అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే నిందితుడి పేరును గోప్యంగా ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. అతడి ద్వారా వాస్తవాల్ని తెలుసుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామని వనపర్తి జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.

First published:

Tags: Minor girl raped, Telangana crime news, Wanaparthi

ఉత్తమ కథలు