మెదక్‌లో విషాదం.. మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

ఫలితాలు ప్రకటించడానికి ముందే తాను ఉత్తీర్ణత సాధించలేమోనన్న భయంతో గురువారం ఉదయమే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సాయంత్రం వచ్చిన ఫలితాల్లో శిల్ప ఒక్క బయాలజీలో మాత్రమే ఫెయిల్ కావడం గమనార్హం.

news18-telugu
Updated: June 19, 2020, 7:58 AM IST
మెదక్‌లో విషాదం.. మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ ఫలితాలకు ముందే ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, ఫలితాల అనంతరం మరో విద్యార్థిని ప్రాణాలను తీసుకుంది. ఈ రెండు ఘటనలు మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీశైలం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతడి కుమార్తె ప్రవళిక(17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ పరీక్షలు రాసింది. అయితే గురువారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రవళిక గదిలోని ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. మరో ఘటనలో మెదక్ జిల్లా చేగుంటకు చెందిన కుర్ర రమేష్, పెంటమ్మల కుమార్తె శిల్ప(17) ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది.

అయితే ఫలితాలు ప్రకటించడానికి ముందే తాను ఉత్తీర్ణత సాధించలేమోనన్న భయంతో గురువారం ఉదయమే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సాయంత్రం వచ్చిన ఫలితాల్లో శిల్ప ఒక్క బయాలజీలో మాత్రమే ఫెయిల్ కావడం గమనార్హం.
Published by: Narsimha Badhini
First published: June 19, 2020, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading