కదులుతున్న ట్రైన్ నుంచి... విద్యార్థిని తోసేసి...

జ్వరంగా ఉండటంతో నిరంజన్... విజయవాడ నుంచి ఇంటికి బయల్దేరాడు. ధర్మవరం వెళ్లే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కాడు. జ్వరంగా ఉండటం... ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ట్రైన్‌లో నిద్రపోయాడు.

news18-telugu
Updated: August 26, 2019, 1:27 PM IST
కదులుతున్న ట్రైన్ నుంచి... విద్యార్థిని తోసేసి...
నమూనా చిత్రం
  • Share this:
కదులుతున్న ట్రైన్ ఎక్కాలన్నా.. దిగాలన్న ఎక్కడి లేని భయం ఉంటుంది. ఎవరూ కూడా సర్వసాధారంగా అలాంటి సాహసాలకు పాల్పడరు. పాపం ఓ విద్యార్థిని మాత్రం కదులుతున్న ట్రైన్ నుంచి ఏకంగా కిందకు తోసేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో ఆ స్టూడెంట్ రెండు కాళ్లూ విరిగిపోయాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని జక్కం చెరువు రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు చెప్పిన ప్రకారం తాడిపత్రికి చెందిన నిరంజన్ రెడ్డి విజయవాడలో ఓ ప్రైవేటు కాలేజ్‌లో ఇంటర్ సెకండీయర్ చదువుతున్నారు.

అయితే జ్వరంగా ఉండటంతో నిరంజన్... విజయవాడ నుంచి ఇంటికి బయల్దేరాడు. ధర్మవరం వెళ్లే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కాడు. జ్వరంగా ఉండటం... ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ట్రైన్‌లో నిద్రపోయాడు. దీంతో తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో నిరంజన్ రెడ్డి రైలు దిగలేకపోయాడు. దీంతో జక్కలచెరువు స్టేషన్‌లో రైలు నెమ్మదిగా వెళ్తే దిగాలన్న ప్రయత్నంలో డోర్ దగ్గర నిలబడ్డాడు. ఇంతలో ట్రైన్ లోపల వెనుకవైపు నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హఠాత్తుగా అతడిని కిందికి తోసేశారు. వేగంగా వెళ్తున్న రైలు నుంచి కింద పడటంతో నిరంజన్‌ రెండుకాళ్లు విరిగిపోయాయి. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు వెంటనే నిరంజన్ రెడ్డిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించి... అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>