చిత్తూరులో దారుణం.. కాలేజీ నుంచి వస్తుండగా బాలిక కిడ్నాప్

ప్రతీకాత్మక చిత్రం

కాలేజీ నుంచి తిరిగొస్తుండగా ఫాలో అయిన సతీష్.. ఆమెను కిడ్నాప్ తీసి కారులో తీసుకెళ్లాడు. ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Share this:
    దేశంలో ఆడవారికి భద్రత లేదంటూ మహిళా లోకం భగ్గుమంటోంది. దిశా ఘటన తర్వాత మరోసారి రోడ్డెక్కి నినదిస్తోంది. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తుండగానే.. ఏపీలో మరో దారుణం జరిగింది. చిత్తూరులో ఇంటర్ బాలికను కిడ్నాప్ చేశారు. కలకడ మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది.

    బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం..  ఇంటర్ సెకండియర్ చదువుతున్న  బాలికను సతీష్ అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. కాలేజీ నుంచి తిరిగొస్తుండగా ఫాలో అయిన సతీష్.. ఆమెను కిడ్నాప్ తీసి కారులో తీసుకెళ్లాడు. ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురిని క్షేమంగా తీసుకురావాలని పీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. బాలిక కిడ్నాప్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పీలేరు-కడప రోడ్డులోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: