ప్రేమ పేరుతో వంచించి.. ఇంటర్ విద్యార్థినిని లొంగ దీసుకొని..

ఇంటర్ చదువుతున్న అమ్మాయికి ప్రేమ వల విసిరాడు.. లొంగదీసుకొని తన కోరిక తీర్చుకున్నాడు.. కడుపు చేసి పక్కకు తప్పుకున్నాడో యువకుడు.. ఈ దారుణ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకిలో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: May 26, 2020, 12:52 PM IST
ప్రేమ పేరుతో వంచించి.. ఇంటర్ విద్యార్థినిని లొంగ దీసుకొని..
(ప్రతీకాత్మకచిత్రం)
  • Share this:
ఇంటర్ చదువుతున్న అమ్మాయికి ప్రేమ వల విసిరాడు.. లొంగదీసుకొని తన కోరిక తీర్చుకున్నాడు.. కడుపు చేసి పక్కకు తప్పుకున్నాడో యువకుడు.. ఈ దారుణ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకిలో చోటుచేసుకుంది. అద్దంకి గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి ఓ యువకుడు ప్రేమ అంటూ వల వేశాడు. ఆమెతో తన కోరిక తీర్చుకొని వదిలేశాడు.. అయితే, రెండ్రోజుల క్రితం ఆ విద్యార్థినికి కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా విస్తుపోయే విషయం తెలిసింది. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ బాలిక పురిటి నొప్పులతో బాధపడుతోందని తేలింది. ఆమెను ఆపరేషన్ థియేటర్‌కు తరలించి, ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం గురించి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించగా సెప్టెంబర్ నుంచి విద్యార్థిని కాలేజీకి రావడం లేదని చెప్పారు. దీంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
First published: May 26, 2020, 12:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading