Tamilnadu: బాంబులా పేలిన సెల్ ఫోన్.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం.. తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి..

ప్రతీకాత్మక చిత్రం

Mobile Blast: సెల్ ఫోన్ చార్జింగ్ ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. కొడుకు మృతి తట్టుకోలేక అతడి తండ్రి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.

  • Share this:
    చార్జింగ్ పెట్టిన సమయంలో మొబైల్ ను వాడొద్దంటూ నిపుణులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో చార్జింగ్ పెట్టిన సమయంలో సెల్ ఫోన్లు పేలుతున్న ఘటనలు ఇటీవల అధికమయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. కొడుకు మృతి తట్టుకోలేక అతడి తండ్రి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. వివరాల ప్రకారం.. కరూర్‌ జిల్లా చిన్నతారాపురానికి చెందిన బాలాజీ ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం బాలాజీ తన సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టాడు. దీంతో ఫోన్ బాగా వేడెక్కి పెద్ద శబ్ధంతో బాంబు మాదిరిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలాజీ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అప్పడిదాగా ఆడుతూ పాడుతూ కనిపించిన కుమారుడు విగతజీవిగా పడిపోవడంతో తట్టుకోలేని తండ్రి చెల్లముత్తు (40) గుండెపోటుకు గురై చనిపోయాడు. ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    ఇదిలా ఉంటే.. పెన్ను పట్టుకోవాల్సిన చేతితోనే గన్ పట్టుకున్నాడు. చిన్న తగాదాకే కక్ష పెంచుకున్నాడు. ఆడుకోవాల్సిన తోటి విద్యార్థిని బలిగొన్నాడు. ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి లోకమంతా నూతన సంవత్సర వేడుకల కోసం ఎదురు చూస్తోంటే.. బులంద్‌షహర్ జిల్లాలోని 10 వ తరగతి చదువుతున్న ఒక మైనర్‌ విద్యార్థి మాత్రం తన సహచరుడిపై పగతో రగిలిపోయాడు. క్లాస్‌ రూంలో జరిగిన చిన్న తగాదాకే పథకం ప్రకారం తన క్లాస్‌మేట్‌ను కాల్చి చంపాడు. ఏకంగా ఆ బాలుడుపై మూడు సార్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

    ఇద్దరూ మైనర్‌ బాలురు కావడం, నిందితుడు తరగతి గదిలో ఏకంగా తుపాకీతో కాల్పులకు తెగబడటం ఆందోళన రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు బాలురు 14 సంవత్సరాల వయస్సున్నవారే. కేవలం సీటుకోసం నిన్న ఇద్దరూ తగాదా పడ్డారు. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు తన మామయ్య తుపాకీని పాఠశాలకు తీసుకెళ్లి మరీ గురువారం ఉదయం బాధిత విద్యార్థిపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
    Published by:Nikhil Kumar S
    First published: