ఆ నింద భరించలేక విద్యార్థిని ఆత్మహత్య..

ఇటీవల ఓ విద్యార్థిని బ్యాగులో డబ్బులు పోవడంతో శశిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య కొన్నిరోజులుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి.

news18-telugu
Updated: June 20, 2019, 3:22 PM IST
ఆ నింద భరించలేక విద్యార్థిని ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చేయని తప్పుకు తనపై నింద వేశారన్న కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరు శివారులో ఉన్న విజ్ఞాన్ కాలేజీలో ఈ ఘటన జరిగింది.ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న గూడపాటి శశి(17) అనే విద్యార్థినిపై తోటి విద్యార్థులు దొంగతనం నింద వేశారు. ఇటీవల ఓ విద్యార్థిని బ్యాగులో డబ్బులు పోవడంతో శశిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య కొన్నిరోజులుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి.

ఇదే విషయమై తోటి విద్యార్థినులతో తరుచూ గొడవ జరుగుతుండటంతో శశి తీవ్రంగా కలత చెందింది. బుధవారం రాత్రి హాస్టల్ బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం బాత్‌రూమ్‌లో శశి వేలాడుతూ కనిపించడంతో విద్యార్థినులు గట్టిగా కేకలు పెట్టారు. అనంతరం యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

First published: June 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు