ఐఐటీలో ర్యాంకు రాదేమోనని గన్‌తో కాల్చుకున్న ఇంటర్ విద్యార్థి..

ఐఐటీలో ర్యాంకు వస్తుందో లేదో అన్న భయంతో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇంటర్ విద్యార్థి.. నేరేడ్‌మెట్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

news18-telugu
Updated: April 30, 2019, 11:34 AM IST
ఐఐటీలో ర్యాంకు రాదేమోనని గన్‌తో కాల్చుకున్న ఇంటర్ విద్యార్థి..
నమూనాచిత్రం
news18-telugu
Updated: April 30, 2019, 11:34 AM IST
నేరేడ్‌మెట్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఐటీలో ర్యాంకు రాదేమోనన్న భయంతో సోహెల్ అనే విద్యార్థి తండ్రి గన్‌తో కాల్చుకున్నాడు. సోహెల్ తండ్రి రిటైర్డ్ ఆర్మీ జవానుగా పనిచేశాడు. ఐఐటీలో కోచింగ్ తీసుకుంటున్న సోహెల్.. నేడు రిజల్ట్స్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ర్యాంకు రాదేమోనన్న అనుమానంతోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన ఇంటర్ రిజల్ట్స్‌లో కొన్ని బ్యాక్ లాగ్స్ కూడా ఉన్నాయి. ఈ విషయంలో తండ్రి మందలించడం.. ఐఐటీ ర్యాంకు టెన్షన్ కారణంగానే అర్ధరాత్రి తన బెడ్‌రూమ్‌లోనే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అంటున్నారు.

ఈ మధ్యకాలంలో పరీక్షల్లో ఫెయిలై విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితులు మారాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. కేవలం పరీక్షల్లో తప్పామని, తండ్రి మందలించాడని ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు తీసుకోవడం సరికాదని చెబుతున్నారు.

కేవలం పరీక్షల ఫలితాల కారణంగా సోహెల్ ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...