హోమ్ /వార్తలు /క్రైమ్ /

నవరాత్రి వేడుకలలో అపశృతి.. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ.. ఎక్కడంటే..

నవరాత్రి వేడుకలలో అపశృతి.. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ.. ఎక్కడంటే..

 ఘర్షణ పడుతున్న ఇరువర్గాలు

ఘర్షణ పడుతున్న ఇరువర్గాలు

Madhya Pradesh: నవరాత్రి వేడుకలలో అపశృతి సంభవించింది. దుర్గామాత దగ్గర గర్బా నృత్యంపై ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు జరిగాయి. అది కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Madhya Pradesh, India

మధ్యప్రదేశ్‌లో (Madhya pradesh) నవరాత్రి ఉత్సవాలలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని అగర్ జిల్లా కంకర్ గ్రామంలో ఈ ఘటన సంభవించింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఆదివారం రెండు వర్గాల మధ్య లాఠీలతో ఘర్షణ చోటుచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు అగ్రవర్ణాల వారు తమపై దాడి చేశారని గ్రామంలోని దళిత సంఘాల సభ్యులు చెబుతున్నారు.

అయితే.. మరికొందరు మరో వాదన విన్పిస్తున్నారు. గర్బా ఫంక్షన్ కోసం ఇద్దరు అమ్మాయిలు చేసిన అశ్లీల నృత్యంపై వాదనతో గొడవ ప్రారంభమైందని మరో వైపు చెబుతున్నారు. “ఒక పాట-నృత్య కార్యక్రమం గొడవకు దారితీసింది. అది కాస్త గొడవకు దారితీసింది. వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించినట్లు సీనియర్ పోలీసు అధికారి నవల్ సింగ్ సిసోడియా చెప్పారు.

సంఘటన స్థలంలో వాళ్లంతా  గ్రూపులుగా ఏర్పడి.. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా కర్ణాటకలో (karnataka) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

శివమొగ్గ జిల్లా భద్రావతి లోనిన బొమ్మన కట్టలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది. బొమ్మన కట్టలో ఒక పాము ఇంటి ఆవరణలో కన్పించింది. దీంతో స్నేక్ సోసైటికి సమాచారం అందించారు. అయితే.. ఒక వ్యక్తి పామును పట్టుకున్నాడు.అక్కడ చుట్టుపక్కల ఉన్న వారంతా భయంభయంగా దాన్ని చూస్తున్నారు. ఇంతలో పామును పట్టుకున్నాక.. అతను దాన్ని ముద్దాడాలకున్నాడు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

పాము ఒక్కసారిగా అతడిచేతిలో నుంచి ముఖంపై కాటు వేసింది. దీంతో అతను భయంతో పామును వదిలేశాడు. అక్కడున్న మరికొందరు భయంతో దూరంగా వెళ్లిపోయారు. అప్పుడు మరోక వ్యక్తి పామును బంధించాడు. వెంటనే పాముకాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Dussehra 2022, Madhya pradesh, Viral Video

ఉత్తమ కథలు