హోమ్ /వార్తలు /క్రైమ్ /

కొలంబో దాడులు జరుగుతాయని ముందే తెలుసా? శ్రీలంక ప్రభుత్వం పట్టించుకోలేదా?

కొలంబో దాడులు జరుగుతాయని ముందే తెలుసా? శ్రీలంక ప్రభుత్వం పట్టించుకోలేదా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ దేశ ఇంటిలిజెన్స్ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం అందించి అలర్ట్ చేసింది. పదిరోజుల క్రితమే దాడులపై ఇంటిలిజెన్సీకు హెచ్చరికలు జారీ చేసింది.

    శ్రీలంకలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వరుస దాడులకు దిగుతూ నరమేధం సృష్టించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదిచోట్ల బాంబు పేలుళ్లు జరిపారు. రెండు చోట్ల ఉగ్రవాదులు మానవ బాంబులు పేల్చారు. శ్రీలంక రాజధాని కొలంబోలో రక్తపుటేరులు పారించారు. ఈస్టర్ సందర్భంగా భారీ సంఖ్యలో జనం చర్చీలకు తరలివచ్చారు. ఇదే అదును చూసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ ఘటనలో భారీ స్థాయిలోప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.


    శ్రీలంకలో వరుస పేలుళ్లకు ఐసీస్ కుట్ర చేసినట్లు తెలుస్తోంది.అయితే ఉగ్ర కుట్రకు సంబంధించి భారత్ ముందుగానే శ్రీలంకను హెచ్చరించింది. ఆ దేశ ఇంటిలిజెన్స్ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం అందించి అలర్ట్ చేసింది. పదిరోజుల క్రితమే దాడులపై ఇంటిలిజెన్సీకు హెచ్చరికలు జారీ చేసింది. అయినా శ్రీలంక ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఐసిస్ అనుకున్న ప్రకారమే ... ఊహించిన రీతిలోనే పేలుళ్లకు పాల్పడింది. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 8చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. హోటల్స్, చర్చీల్లో విదేశీయులే టార్గెట్‌గా దాడులు జరిగినట్లు సమాచారం. దీంతో ఆదేశ భద్రతా సిబ్బంది అత్యవసర సమావేశం నిర్వహించింది. శ్రీలంక వ్యాప్ంగా కర్ఫ్యూ విధించింది. సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు వేసింది.

    First published:

    Tags: BLAST, Bomb blast, Columbo Bomb Blast, Sri Lanka, Terror attack, Terrorism

    ఉత్తమ కథలు