హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime : నిప్పు అంటించుకొని.. అమ్మాయిని కౌగలించుకున్నాడు.. ఎందుకంటే..

Crime : నిప్పు అంటించుకొని.. అమ్మాయిని కౌగలించుకున్నాడు.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime : ప్రేమికులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావట్లేదు. అప్పటిదాకా ఒకలా ఉంటూ.. సడెన్‌గా సైకోలవుతున్నారు. ఇంకొందరు వన్ సైడ్ లవ్ చేస్తూ.. దేనికైనా తెగిస్తున్నారు. అలాంటి ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అది మహారాష్ట్రలోని ముంబై. అక్కడ ఓ విద్యార్థి.. తన క్లాస్‌మేట్‌ని కౌగలించుకున్నాడు. అది కూడా మామూలుగా కాదు. నిప్పు అంటించుకొని. ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అతని పేరు గజానన్ ముండే. ఓ పరిశోధనా విద్యార్థి. ఔరంగాబాద్.. హనుమాన్ తెక్డీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పరిశోధనలు చేస్తున్నాడు. అతను పూజా సాల్వేను కౌగలించుకోవడంతో.. అందరూ అవాక్కయ్యారు. అసలు ఇదంతా ఏంటని ఆరా తీస్తే.. ఓ లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది.

పరిశోధన చేసుకునే గజానన్.. ఆ పని కంటే.. పూజాపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఆమెతో మాట్లాడేందుకు రకరకాలుగా ప్రయత్నించాడు. ఆమె కూడా తోటి విద్యార్థి కదా అని మాట్లాడేది. కొన్నాళ్లకు ఆమెను ప్రేమిస్తున్నట్లు ఫీలయ్యాడు. ఓ రోజు అదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. "నువ్వంటే ఇష్టం. మనం పెళ్లి చేసుకుందామా" అని అడిగాడు. ఆమెకు ఆసక్తి లేదని చెప్పింది. ఈ ప్రేమలూ, దోమలూ తనకు కుదరవని చెప్పింది.

ఆ తర్వాత నుంచి గజానన్ తీరు మారింది. తన మ్యారేజ్ ప్రపోజల్‌ను ఎందుకు వ్యతిరేకించింది అని పదే పదే ఆలోచించి.. ఆవేశంతో రగిలిపోతున్నాడు. కొన్నాళ్లకు ఆమె ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నట్లు గజానన్‌కి తెలిసింది. ఎప్పటికైనా తననే పెళ్లి చేసుకుంటుంది అనుకున్న అతను.. అలా జరగట్లేదని తాజాగా అంచనా వేసుకున్నాడు. ఆమె లేకపోతే తాను లేను అనుకున్నాడు. చావైనా బతుకైనా తనతోనే అనుకున్నాడు. తనకు దక్కని ఆమె ఇంకెవరికీ దక్కకూడదనే కుట్ర పూరిత ఆలోచనకు వచ్చాడు.

కొన్ని రోజులుగా ఇన్‌స్టిట్యూట్‌కి రాకుండా ఉన్న పూజా.. తాజాగా ఓ ప్రొఫెసర్‌ని కలిసేందుకు వచ్చింది. ఆమెను ఫాలో అయిన గజానన్.. ఆమె ప్రొఫెసర్ క్యాబిన్‌లోకి వెళ్తున్న సమయంలో.. మరోసారి తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే.. తన చేతిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే మంటలు శరీరమంతా పాకాయి. వేగంగా వెళ్లి.. పూజాని కౌగలించుకున్నాడు. దాంతో మంటలు ఆమెకు కూడా అంటున్నాడు. ఆమె ఎంత ప్రయత్నించినా.. గజానన్ వదల్లేదు. దాంతో.. ఇద్దరూ మంటల్లో కాలిపోయారు.

TTD : టీటీడీ కీలక ప్రకటన.. నేడు వృద్ధులు, దివ్యాంగులకు సర్వదర్శన టికెట్ల జారీ

సంస్థ నిర్వాహకులు ఇద్దర్నీ ఆస్పత్రిలో చేర్చారు. గజానన్‌కి 90 శాతం శరీరం కాలిపోయిందనీ, అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పూజాకి కూడా తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఇలా సైకోలా మారిన ఓ గజానన్ చేసిన దుశ్చర్య వల్ల అతనే కాక.. పూజా కూడా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఇలాంటి వాళ్లతో అప్రమత్తంగా ఉండాలని ఈ కథ చెబుతోంది.

First published:

Tags: Crime news, Maharashtra, Mumbai

ఉత్తమ కథలు