కొంత మంది ఇంట్లో పని కోసం వస్తారు. ఆ తర్వాత.. వారి మాటలతో యజమానులతో నమ్మిస్తారు. ఎంతో నమ్మకంగా ఉన్నట్లు నటిస్తారు. కానీ సమయం దొరకగానే వారి అసలు రంగు చూపిస్తుంటారు. ఇప్పటికే ఇంట్లో పనివారిగా చేరి, ఆ తర్వాత.. దొంగతనాలకు పాల్పడిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొన్ని చోట్ల తమ యజమానులనే చంపి కూడా దొంగతనాలు చేసిన సంఘటనలు అనేకం వార్తలలో నిలిచాయి. వీరికి అన్నంపెట్టిన వారని కూడా పట్టించుకోరు. డబ్బుల,నగల కోసం ఎంతటికైన తెగిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. న్యూఢిల్లీలోని(Delhi) సఫ్ధర్ జంగ్ ఎన్ క్లేవ్ లో అమానుష ఘటన జరిగింది. ఒక యజమాని తన ఇంట్లో తన కొడుకును చూసుకొవడానికి , ఒక పనిమనిషిని పెట్టుకున్నాడు. అయితే..కొన్నిరోజుల పాటు నమ్మకంగానే ఉన్నాడు. ఈ క్రమంలో.. అతడిని నమ్మి ఇంట్లో వారు బైటకు వెళ్లారు. అప్పుడు.. ఇదే అదనుగా భావించిన పనిమనిషి చోరీకి (Thift) పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న దివ్యాంగుడు అలారం మోగించాడు.అప్పుడు పనిమనిషి.. అచ్చం సినిమాలో మాదిరిగా హత్యకు స్కెచ్ వేశాడు. 1996లో వచ్చిన 'తు చోర్ మైన్ సిపాహి' సినిమా (movie Style) లాగానే 17 ఏళ్ల వికలాంగుడైన తన యజమాని బిడ్డను హతమార్చాడు.
ఆ తర్వాత నగదు, నగలతో పారిపోవడానికి ప్రయత్నించి నల్లటి గ్లౌజ్ని వదిలిపెట్టాడు. అయితే.. రియల్ లైఫ్ లో కూడా అచ్చం అలాగే ఇతను కూడా.. ఇంట్లో యజమాని, పిల్లలు లేని టైమ్ చూసి, ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్ లు, డబ్బులను చోరీచేశాడు. ఆ తర్వాత.. ఇంట్లో ఉన్న దివ్యాంగ బాలుడిని చంపి, నల్లటి బ్లౌజ్ ను అక్కడ పారేశాడు. ఎవరో దుండగులు చేసినట్లు వారిపై అనుమానం కల్గేలా ఈ పనిచేసినట్లు తెలుస్తోంది.
ఇంటికి తిరిగోచ్చిన యజమాని ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, బిడ్డ చనిపోయి ఉండటం చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోనికి దిగిన పోలీసులు వెంటనే అన్ని ప్రాంతాలలోని స్టేషన్ లను అలెర్ట్ చేశారు. చివరకు.. న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi