లవర్ కోసం భార్యను చంపి పాతిపెట్టిన భర్త.. దృశ్యం సినిమాలానే..

ఆమె మృతదేహాన్ని తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. ఇక అచ్చం దృశ్యం సినిమా తరహాలో ఆమె ఫోన్‌‌ను బీహార్‌కు వెళ్లే ఓ రైల్లో విసిరేశాడు.

news18-telugu
Updated: December 10, 2019, 10:08 PM IST
లవర్ కోసం భార్యను చంపి పాతిపెట్టిన భర్త.. దృశ్యం సినిమాలానే..
నిందితుడు ప్రేమ్ కుమార్
  • Share this:
దృశ్యం సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ అన్ని భాషల్లోనూ బంపర్ హిట్టైంది ఆ మూవీ. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఐతే కేరళలో దృశ్యం సినిమాను తలపించేలా ఓ క్రైమ్ కథ వెలుగులోకి వచ్చింది. లవర్ కోసం కట్టుకున్న భార్యను గొంతు నులిమి చంపేశాడు భర్త. ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను పాతిపెట్టి..మళ్లీ ఏమీ తెలియనట్లుగా మిస్సింగ్ కేసుపెట్టాడు. మరి ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? దృశ్యం సినిమా తరహాలో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి?

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..కేరళకు చెందిన ప్రేమ్ కుమార్, విద్య భార్యాభర్తలు. కొన్నేళ్ల పాటు వీరి కాపురం బాగానే సాగింది. ఐతే కొన్ని రోజుల క్రితం రీయూనియన్‌లో స్కూల్ ఫ్రెండ్స్‌ని కలిశాడు ప్రేమ్. ఆ సమయంలో అతడికి సునీత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వారి బంధానికి అడ్డుగా ఉన్న విద్యను చంపేద్దామని ప్లాన్ చేసి.. పక్కాగా అమలు చేశారు. సెప్టెంబరు 22న తిరువనంతపురంలో ఓ విల్లాలో భార్య విద్యతో కలిసి ఉన్నాడు ప్రేమ్‌కుమార్. ప్లాన్ ప్రకారం సునీత కూడా అక్కడికి చేరింది. ఇద్దరూ కలిసి కలిసి విద్యను గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. ఇక అచ్చం దృశ్యం సినిమా తరహాలో ఆమె ఫోన్‌‌ను బీహార్‌కు వెళ్లే ఓ రైల్లో విసిరేశాడు.

మళ్లీ ఏమీ ఎరుగనట్లుగా తిరువనంతపురం వెళ్లి తన భార్య కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టారు. అనంతరం రెండు నెలల పాటు లవర్‌తో కలిసి తిరునల్వేలిలో కాపురం పెట్టారు. ఆమె సెల్‌ఫోన్ నుంచి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బీహార్‌లోని ఓ ప్రాంతంలో లొకేషన్ గుర్తించారు. ఇక మరోవైపు తిరునల్వేలిలో ఓ గుర్తు తెలియని మహిళ డె‌డ్‌బాడీ బయటపడడంతో కేరళ పోలీసులు వెళ్లి పరిశీలించారు. అది విద్యదే అని నిర్థారించుకున్న తర్వాత అసలు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు సమయంలో ప్రేమ్, విద్య మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని గుర్తించారు పోలీసులు. భర్త ప్రవర్తన తీరుపై అనుమానం రావడంతో తమదైన స్టైల్లో విచారించారు. దాంతో ఎట్టకేలకు అతడు నేరం ఒప్పుకున్నాడు. సునీతతో కలిసి ఉండేందుకే తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు.
Published by: Shiva Kumar Addula
First published: December 10, 2019, 10:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading