క్రైమ్ సీరియల్స్ చూసి... క్యాబ్ డ్రైవర్ భారీ స్కెచ్... కానీ...

(నమూనా చిత్రం)

క్రైమ్ సీరియల్స్ చూసిన ఆ జంట.. అందులో ఓ విషయాన్ని మాత్రం గమనించలేకపోయింది.

 • Share this:
  బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని.. ఆ డబ్బులు తిరిగి కట్టడానికి అక్రమార్గం పట్టాడో క్యాబ్ డ్రైవర్. అతడికి భార్య కూడా సహకరించడం గమనార్హం. బెంగళూరులో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలను పరిశీలిస్తే... వెంకటేష్ అనే క్యాబ్ డ్రైవర్.. ఓ యాప్ ఆధారిత కంపెనీకి సేవలు అందిస్తున్నాడు. అతడికి మూడేళ్ల క్రితం అర్పిత అనే మహిళతో వివాహం జరిగింది. వారు రూ.10లక్షల బ్యాంక్ లోన్ తీసుకున్నారు. అయితే, ఆ బ్యాంక్ లోన్ తీర్చడానికి వారి వద్ద డబ్బులేదు. దీంతో వారు ఓ పథకం వేశారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో వారు పలు క్రైమ్ సీరియల్స్‌ను ఫాలో అయ్యారు. అందులో నచ్చిన ఓ ప్లాన్‌ను అమలు చేశారు.

  తొలుత వారికి తెలిసిన వారితో స్నేహం మరింత పెంచుకోవాలని నిర్ణయించారు. వెంకటేష్‌కు దూరపు బంధువు అయిన లక్ష్మమ్మతో భార్యభార్తలు స్నేహంగా మెలిగారు. కొన్ని రోజులు వారి ఇంటికి రాకపోకలు సాగించారు. అనంతరం ఓ రోజు లక్ష్మమ్మ, ఆమె భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చంద్రేగౌడను చంపేశారు. వారి వద్ద నుంచి రూ.8.5లక్షల విలువైన బంగారం, ఇతర ఆభరణాలు, నగదు దోచుకుని వెళ్లారు.

  అంతకు ముందు కూడా ఈ క్యాబ్ డ్రైవర్ దంపతులు వారి బంధువుల్లో ఓ వృధ్దజంటను చంపారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన లలితమ్మ, ఆమె భర్త గుండెగౌడను కూడా చంపేశారు. వారి వద్ద రూ.2వేల నగదు, 60 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు. ఇలా వృద్ధ జంటలను చంపిన వారి వద్ద దోచుకున్న బంగారాన్ని ఓ నగల వ్యాపారి అమ్మేశారు.

  అయితే, క్రైమ్ సీరియల్స్ చూసిన ఆ జంట.. అందులో ఓ విషయాన్ని మాత్రం గమనించలేకపోయింది. వెంకటేష్, అర్పిత లక్ష్మమ్మ ఇంటికి వెళ్లిన దృశ్యాలు ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియోనే వారిద్దరినీ పట్టించింది.
  First published: