Home /News /crime /

INSPIRED BY ARUNDHATI MOVIE KARNATAKA YOUTH IMMOLATES SELF PVN

Shocking : అరుంధతి సినిమా చూసి తనను తాను తగలబెట్టుకున్న యువకుడు..ఎందుకో తెలిస్తే షాక్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Youth Sucide After Watching Arundhati : కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల యువకుడు తెలుగు హారర్ ఫాంటసీ మూవీ "అరుంధతి"ని పలుసార్లు చూసి ఆ సినిమాలో చూపిన విధంగా మోక్షం లభిస్తుందనే నమ్మకంతో బుధవారం సాయంత్రం గ్రామ శివారులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Youth Sucide After Watching Arundhati : సినిమా అనేది వినోద మాధ్యమం. రెండున్నర నుంచి మూడు గంటల పాటు సినిమా చూసే వ్యక్తి తన వ్యక్తిగత కష్టాలను మర్చిపోయి, చూస్తున్నంత సేపు వినోదాన్ని పంచాలనేది సినిమా ఉద్దేశం. అయితే కొంతమంది సినిమా చూసి ఇంప్రెస్ అయి నటులని అనుకరిస్తున్నిరు. సినిమా వేరు, జీవితం వేరు అని తెలియని ఫ్యాన్స్ సినిమా హీరో హీరోయిన్లను అనుకరిస్తూ కొన్నిసార్లు తమ జీవితాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో అలాంటి ఘటనే జరిగింది. కర్ణాటక(Karnataka)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తుముకూరు(Tumukuru) జిల్లా మధుగిరి తాలూకాలోని గిడ్డయ్యనపాళ్య గ్రామానికి చెందిన రేణుకాప్రసాద్ అనే 23 ఏళ్ల యువకుడు తెలుగు హారర్ ఫాంటసీ మూవీ "అరుంధతి(Arundhati)"ని పలుసార్లు చూసి ఆ సినిమాలో చూపిన విధంగా మోక్షం లభిస్తుందనే నమ్మకంతో బుధవారం సాయంత్రం గ్రామ శివారులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అటుగా వెళ్తున్న కొందరు వెంటనే రేణుకాప్రసాద్(Renuka Prasad)ని హాస్పిటల్ కు తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సూచనమేరకు అక్కడి నుంచి బెంగళూరు(Bengaluru)లోని విక్టోరియా హాస్పిటల్ కి తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం రేణుకాప్రసాద్ మృతి చెందాడు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..."రేణుకాప్రసాద్‌ ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల్లో పురవర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టాపర్‌గా నిలవడంతో కుటుంబ సభ్యులు ఉన్నత చదువుల కోసం తుమకూరులోని కాలేజీలో చేర్పించారు. ఫస్ట్ ఇయర్ పీయూసీ పూర్తి అయ్యాక సినిమాలు చూసే వ్యసనం వల్ల చదువు మానేశాడు. ఏ పనీ చేయకుండా ఒక చోటి నుంచి మరో చోటికి తిరుగుతూ ఉండేవాడు. ఇటీవల కాలంలో తెలుగు సూపర్ హిట్ సినిమా ‘అరుంధతి’ని 15-20 సార్లు చూశాడు, అరుంధతి సినిమాలో కథానాయిక ఆమె ఇష్టానుసారం చనిపోయి, శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవడానికి పునర్జన్మ పొందుతుంది. ఈ సినిమా చూసి ప్రేరణ పొందిన రేణుకాప్రసాద్‌ తాను కూడా తన ఇష్టప్రకారం చనిపోయి మళ్లీ పునర్జన్మ పొందాలని కోరుకున్నాడు. దీంతో బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ నుండి 20 లీటర్ల పెట్రోల్‌ను కొనుగోలు చేశాడు. అందులో ఒక లీటర్‌ను ఉపయోగించి ఆత్మహత్య చేసుకున్నాడు"అని పోలీసులు తెలిపారు.

తనను తాను కాల్చుకున్న వెంటనే తనకు మోక్షం కలగాలని బాధితుడు తన తండ్రి సిద్దప్పను కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కొడిగెనహళ్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేణుకాప్రసాద్ ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, ఇరుగుపొరుగు, గ్రామస్తులు అందరూ షాక్‌కు గురయ్యారు. "అతను బాగా చదివి మంచి కెరీర్‌లో ఉండాలని కోరుకున్నాం. దురదృష్టవశాత్తు, సినిమాల పట్ల అతని వ్యసనం అతని ప్రాణాలను బలిగొంది” అని లెక్చరర్ అయిన సమీప బంధువు రాజు విచారం వ్యక్తం చేశాడు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, Karnataka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు