బక్రీద్‌కు బట్టలు కొనివ్వలేదని ... భార్యకు ట్రిపుల్ తలాక్

భర్త ఓ మర్డర్ కేసులో 2014 నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పట్నుంచి అతడు జైల్లోనే ఉన్నారు. అయితే బక్రీద పండగకు తనకు కుర్తా పైజామా కావలని కోరాడు.

news18-telugu
Updated: August 27, 2019, 1:24 PM IST
బక్రీద్‌కు బట్టలు కొనివ్వలేదని ... భార్యకు ట్రిపుల్ తలాక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ట్రిపుల్ తలాక్ చెబితే కఠిన శిక్షలు తప్పవని కేంద్రం కొత్త చట్టం చేసినా... ముస్లీం మహిళలకు తలాక్‌లు చప్పే భర్తల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఉత్తర్ ప్రదేశ్‌లో మరో ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. అమ్రోహ జిల్లాకు చెందిన ఓ మహిళకు భర్త చిన్న కారణానికే విడాకులు ఇచ్చేశాడు. బక్రీద్ పండగకు భార్య తనకు కుర్తా పైజామా కొనివ్వలేదని భార్యకు విడాకులు చెప్పేశాడు. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం  ముర్షిద అనే మహిళకు గతకొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే భర్త ఓ మర్డర్ కేసులో 2014 నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పట్నుంచి అతడు జైల్లోనే ఉన్నారు. అయితే బక్రీద పండగకు తనకు కుర్తా పైజామా కావలని కోరాడు.

అయితే సమయానికి డబ్బులు లేకపోవడంతో ముర్షిద భర్తకు కొత్త బట్టలు సమకూర్చలేకపోయింది. అంతే ఆ చిన్నపాటి దానికి అతడ్ని కలిసేందుకు జైలుకెళ్లిన   భార్యకు మూడు తలాకులు చెప్పేశాడు. దీంతో బాధితురాలు ఈవిషయాన్ని ఇరుకుటుంబాల పెద్దలకు చెప్పింది. అయితే వాళ్ల ముందు కూడా భార్యకు విడాకులు ఇచ్చేశాడు. దీంతో చేసేది ఏం లేక బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది.. గజ్రోలా పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఇప్పటివరకు ఎనిమిది కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు బాధితురాలు ముర్షిదా తనకు న్యాయం చేయాలంటూ మోదీకి కూడా లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది.

First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు