Home /News /crime /

INDORE WIFE EXPOSED CROSS GENDER ENGINEER HUSBAND DRESS UP LIKE WOMAN PUT LIPSTICK INDORE COURT GAVE VERDICT PVN

నా భర్త అమ్మాయిలా రెడీ అవుతున్నాడు..శృంగారం చేయట్లేదు..కోర్టు మెట్లెక్కిన మహిళ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాయంత్రం కాగానే తన భర్త తనను తాను స్త్రీలా అలంకరించుకుంటున్నాడని,పెదవులకు లిప్‌ స్టిక్‌ పూసుకుంటున్నాడని, చెవిపోగులు ధరించేవాడని,పెళ్లై రెండేళ్లు అయినా ఒకసారి కూడా లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని ఆరోపిస్తూ ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది.

ఇంకా చదవండి ...
Husband dress up like woman :  సాయంత్రం కాగానే తన భర్త తనను తాను స్త్రీలా అలంకరించుకుంటున్నాడని,పెదవులకు లిప్‌ స్టిక్‌ పూసుకుంటున్నాడని, చెవిపోగులు ధరించేవాడని,పెళ్లై రెండేళ్లు అయినా ఒకసారి కూడా లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని ఆరోపిస్తూ ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. మహిళ పిటిషన్‌పై తీర్పు వెలువరిస్తూ.. భర్తకు నెలకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 2021 మార్చి 5 నుంచి భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లో ఈ ఘటన జరిగింది.

మధ్యప్రదేశ్‌(Madhyapradesh) రాష్ట్రంలోని ఇండోర్‌(Indore) లోని లసుడియా ప్రాంతంలో నివాసం ఉంటున్న26 ఏళ్ల బాధితురాలికి...2018 ఏప్రిల్ నెలలో దిలేశ్వర్(32)అనే ఇంజినీర్ తో వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. రెండేళ్ల ఎఫైర్ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం దిలేశ్వర్ తన భార్యను పూణెకు తీసుకెళ్లాడు. అతనితో పాటు కుటుంబం మొత్తం కూడా పూణేకు షిఫ్ట్ అయింది. అయితే పూణే వెళ్లిన తర్వాత దిలేశ్వర్..భార్యను వేధించడం ప్రారంభించాడు. దిలేశ్వర్ తో పాటు అతడి తల్లి కూడా వేధించడం మొదలుపెట్టింది. బాధితురాలిని తీవ్రంగా వేధించి ఇరువురూ ఇబ్బంది పెట్టారు. ఇక ఆమె ఎదురుతిరగడంతో పుట్టింటికి పంపించేశాడు భర్త. ఎన్ని రోజులైనా తీసుకువెళ్లడానికి రాకపోవడం వల్ల ఆమె మహిళా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, అత్తపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. బాధితురాలు హైకోర్టులోనూ పిటిషన్​ వేసింది. ఆ ఫిర్యాదులో తన భర్త వింత చేష్టలను పేర్కొంది. పెళ్లయిన తర్వాత భర్త నిత్యం చాలా దూరం ఉంటున్నాడని.. పెళ్లి తర్వాత ఎప్పుడూ ఒకసారి కూడా లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని,తాను దగ్గరకు రావడానికి ప్రయత్నించినప్పుడల్లా భర్త వేరే గదిలోకి వెళ్లేవాడని బాధితురాలు తెలిపింది.

IRCTC Sattiv Food: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ట్రైన్‌లో సూపర్ ఫుడ్.. ఇస్కాన్‌తో ఐఆర్‌సీటీసీ ఒప్పందం

భర్తపై అనుమానం వచ్చి భర్తపై నిఘా పెట్టగా..అసం విషయం తెలిసిందని పేర్కొంది. తన భర్త సాయంత్రం కాగానే తనను తాను స్త్రీలా అలంకరించుకోవడం ప్రారంభించేవాడని బాధితురాలుతెలిపింది. ఆడవారిలా మేకప్​ వేసుకునేవాడని, చెవిపోగులు ధరించేవాడని, పెదవులకు లిప్​స్టిక్​ పూసుకునేవాడని.. అలా చెయ్యొదని వారించినా చేయి చేసుకునేవాడిని ఆరోపించింది. తాను అలా చేయొద్దు అన్నందుకు తనను కొట్టి హింసించేవాడని,చివరికి తనను పూణె నుంచి తీసుకొచ్చి ఇండోర్‌లో వదిలేసి వెళ్లాడని, ఆ తర్వాత తనను తీసుకెళ్లడానికి తిరిగి రాలేదని తెలిపింది. కోర్టు ఆదేశాలతో మహిళా శిశు అభివృద్ధి శాఖ రహస్య నివేదికను రూపొందించి కోర్టుకు సమర్పించింది. మహిళా శిశు అభివృద్ధి శాఖ నివేదికలో బాధితురాలిపై గృహహింస జరిగినట్లు రుజువైంది. మహిళ పిటిషన్‌పై తీర్పు వెలువరిస్తూ.. భర్తకు నెలకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 2021 మార్చి 5 నుంచి భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.



ఆ మహిళ భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించింది

అయితే, బాధితురాలి తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది కృష్ణ కుమార్ కున్హారే తెలిపిన వివరాల ప్రకారం.."మహిళ తన భర్త నిజస్వరూపాన్ని కోర్టులో సాక్ష్యాధారాలతో సమర్పించడం దాదాపు ఇదే మొదటి కేసు. తన భర్త కూడా ఆడవాళ్లలానే మేకప్ వేసుకుంటాడని ఆ మహిళ చెప్పింది. మహిళ భర్తకు సహచరుల బృందం ఉంది, వారు తరచుగా సాయంత్రం స్త్రీల వలె దుస్తులు ధరిస్తారు. దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా బాధితురాలు కోర్టులో సమర్పించిందని తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Madhyapradesh, WOMAN

తదుపరి వార్తలు