Shock: అతనికి పుర్రె లేదు. డాక్టర్లే తొలగించారు. ఎందుకో తెలుసా?

Shock: అతనికి పుర్రె లేదు. డాక్టర్లే తొలగించారు. ఎందుకో తెలుసా?

ఇదో విచిత్రమైన, అరుదైన, ఆశ్చర్యకరమైన, షాకింగ్ కేసు. ఇలా కూడా జరుగుతుందా అని మనకు అనిపించే కేసు. ఈ కేసులో ఏం జరిగిందో, ఆ వ్యక్తి ఏం చెప్పాడో, డాక్టర్లు ఏం చెప్పారో వివరంగా తెలుసుకుందాం.

  • Share this:
    బాధితుడి వెర్షన్: అతని పేరు కీర్తి పార్మర్. మధ్యప్రదేశ్... ఉజ్జైన్‌కి చెందిన వాడు. కొన్నేళ్ల కిందట అతనికి బ్రెయిన్ ట్యూమర్ (మెదడులో గడ్డ) వచ్చింది. ఇండోర్‌లో ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లను కలిశాడు. సమస్య చెప్పాడు. స్కానింగ్ చేశారు. బ్రెయిన్‌లో ట్యూమర్ ఉందనీ... దాన్ని తొలగించకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. 2019లో ఆపరేషన్ జరిగింది. పుర్రెలో కుడివైపు భాగాన్ని పగలగొట్టి... ట్యూమర్ తొలగించారు. తిరిగి పగలగొట్టిన పుర్రెను అతికిస్తామన్నారు గానీ... అతికించలేదు. చర్మాన్ని కుట్టేశారు. ఎందుకు అలా చేశారంటే... ఆ పుర్రె ముక్క... ముక్కలైపోయిందనీ... దాన్ని తిరిగి సెట్ చెయ్యడం కుదరదని డాక్టర్లు చెప్పారు. అందువల్ల ఇక అతను ఎప్పటికీ ఆ పుర్రె ముక్క లేకుండానే బతకాల్సి ఉంటుంది.

    బాధితుడి కుటుంబ సభ్యుల వెర్షన్: డాక్టర్లకు ఆపరేషన్ చేయడం చేతగాక... పుర్రెను పగలగొట్టేశారనీ... ఆ తర్వాత నాటకాలు ఆడుతూ... పుర్రె ముక్క లేకుండానే ఆపరేషన్ పూర్తి చేసేశారనీ... తమకు న్యాయం చెయ్యాలని కీర్తి పార్మర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆపరేషన్ తర్వాత తిరిగి పుర్రెను సెట్ చేస్తామని మాట ఇచ్చారనీ... తీరా ఆపరేషన్ పూర్తయ్యాక... పుర్రె పగిలిపోయిందని మాట మార్చుతున్నారని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ఆపరేషన్ చేసి... పుర్రెను సెట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

    డాక్టర్ల వెర్షన్: అదేమీ చిన్న గడ్డ కాదు... చాలా పెరిగిపోయింది. దాన్ని తొలగించాలంటే... పుర్రెలో కీలక భాగాన్ని తొలగించకతప్పదు. అలా తొలగించడం అనుకున్నంత తేలిక కాదు. తొలగించి తిరిగి అమర్చాలంటే... ఆ పుర్రె ముక్క పద్ధతిగా ఉండాలి. కానీ ఆపరేషన్ సమయంలో... పుర్రె ముక్క పద్ధతిగా రాలేదు. ముక్కలైపోయింది. ఇలా జరిగే అవకాశం ఉందనీ... అలా జరిగితే... పుర్రెను తిరిగి సెట్ చెయ్యడం కుదరదని ముందే చెప్పాం. అందుకు అతను ఒప్పుకున్న తర్వాతే ఆపరేషన్ చేశాం. మేం అంచనా వేసినట్లుగానే అది ముక్కలైపోయింది. కాబట్టి... తిరిగి సెట్ చెయ్యడం కుదరలేదు. ఇందులో మా తప్పేమీ లేదు అంటున్నారు డాక్టర్లు.

    పోలీసుల వెర్షన్: కీర్తి పార్మర్ MIG పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తాను పుర్రె లేకుండా బతకాల్సి వస్తోందనీ... ఏ క్షణమైనా తన బుర్రకు కన్నం పడే ప్రమాదం ఉందనీ... తనకు న్యాయం చెయ్యాలని కోరుతున్నాడు. కేసు రాసిన పోలీసులు... దర్యాప్తు చేశాకగానీ... తమ వెర్షన్ ఏంటనేది చెప్పలేమంటున్నారు.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: ఏ రాశి వారు ఎలాంటి వారిని ఇష్టపడతారు.. ఎవర్ని పెళ్లి చేసుకోవాలి?

    పేషెంట్ వైపు నుంచి చూస్తే... అయ్యో అనిపించడం సహజం. డాక్టర్లేమో... కష్టపడి ఆపరేషన్ విజయవంతంగా చేస్తే... తిరిగి తమనే తిడుతున్నారని అంటున్నారు. ఏది నిజమో, ఏది రాంగో... పోలీసులు తేల్చాలి. అప్పటి వరకూ మనం ఎటూ తేల్చుకోలేం.
    Published by:Krishna Kumar N
    First published: