శనివారం తెల్లవారుఝామున మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore Fire Accident)లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. స్వర్ణ్ప్రభకాలనీలో మూడుంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి..ఏడుగురు మరణించారు. ఐతే షార్ట్ సర్యూట్ వల్లే ఈప్రమాదం జరిగి ఉంటుదని మొదట అందరూ భావించారు. కానీ దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ ఫుటేజీని చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఓ యువకుడు ఇంటి బేస్మెంట్లో ఉన్న స్కూటీకి నిప్పంటిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ తర్వాత మంటలు వ్యాపించి భవనం మొత్తానికి మంటలు అంటుకున్నాయి. సీసీ పుటేజీ ఆధారంగా యువకుడిని పట్టకొని విచారించగా.. సంచలన విషయాలు తెలిశాయి.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝాన్సీకి అయిన సంజయ్ అలియాస్ శుభం దీక్షిత్ 6 నెలల క్రితం ఈ భవనంలోనే అద్దెకు ఉండేవాడు. పక్కనే ఉండే ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆ తర్వాత కొన్నాళ్లుకు రూమ్ ఖాళీ చేసి వేరొక ప్రాంతానికి వెళ్లిపోయారు. ఐతే ఘటన జరిగిన రోజు రాత్రి సంజయ్ ఆ అమ్మాయిని కలిసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఏదో విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. తాను ఎంత చెప్పినా ఆమె వినిపించుకోక పోవడంతో.. అతడు కోపంతో రగిలిపోయాడు. అమ్మాయి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత.. ఆమె స్కూటీకి నిప్పంటించి పారిపోయాడు. పెట్రోల్ ట్యాంక్ పేలి.. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. భవనం మొత్తం వ్యాపించాయి. తెల్లవారుఝామున 03.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ టైమ్‌లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. తేరుకునే లోపే చాలా మంది మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. మరికొందరు ప్రాణాలు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనంపై నుంచి దూకి గాయపడ్డారు. మొత్తం 9 మంది గాయపడగా.. వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Shocking: డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ వరుడు మృతి..పెళ్లికి కొన్ని గంటల ముందు తీవ్ర విషాదం
పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఇది షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని అనుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. అన్ని ఫ్లాట్లనూ పరిశీలించారు. అనంతరం సీసీ పుటేజీ చూడగా.. అసలు విషయం తెలిసింది. బేస్మెంట్లో పార్క్ చేసి ఉన్న స్కూటీకి నిప్పంటిస్తూ కనిపించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. క్షణాల్లోనే మంటలు ఎగిసిపడ్డాయి. మిగతా బైక్‌లకు కూడా మంటలు అంటుకొని.. భవనం మొత్తం వ్యాప్తించాయి. అతడి గురించి ఆరా తీయగా.. ఆరు నెలల క్రితం ఇదే ఇంట్లో అద్దెకు ఉన్నట్లు స్థానికులు వివరించారు. ఆ యువకుడు మాట్లాడిన అమ్మాయిని అదుపులోకి అతడి గురించి వివరాలు తెలుసుకున్నారు.
కూతురి పెళ్లి అప్పు తీర్చడం కోసం IPLలో బెట్టింగ్ చేసిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అమ్మాయి చెప్పిన వివరాల ఆధారంగా.. అతడు ఉండే ప్రాంతానికి వెళ్లారు. పోలీసులను చూసి శుభం దీక్షిత్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కిందపడడంతో గాయాలయ్యాయి. పోలీసులు అతడి పట్టుకొని అరెస్ట్ చేశారు. శుభం దీక్షిత్‌తో పాటు భవనం యజమాని ఇన్సాఫ్ పటేల్‌పై కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భవనంలో నిర్ణీత భద్రతా ప్రమాణాలను పాటించలేదని ఆరోపించారు. భద్రతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందుకు గాను అతడిపైనా కేసు పెట్టినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Fire Accident, Madhya pradesh