INDORE BRIDE RAN AWAY AFTER 7 DAYS OF MARRIAGE STEALS GOLD SILVER JEWELRY AND 3 LAKHS CASH SK
పెళ్లై వారమైంది.. పీరియడ్స్‌తో సాకుతో భర్తకు దూరం.. నిజమే అనుకున్నారు.. కానీ ఆ తర్వాత కొంప కొల్లేరు
దొంగ పెళ్లి కూతురు
పెళ్లి తర్వాత రాహుల్‌ని ఆమె దగ్గరకు రానివ్వలేదు. పీరియడ్స్ కోసం సాకులు చెబుతూ దూరం పెడుతూ వచ్చింది. అనంతరం ఏడు రోజుల తర్వాత బంగారు ఆభరణాలతో పాటు మూడు లక్షల రూపాయల నగదుతో పారిపోయింది.
వారిద్దరికి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. వివాహం తర్వాత శోభనం ఏర్పాటు చేశారు. కానీ వధూవరులు కలవలేదు. పీరియడ్స్ పేరుతో ఆమె వద్దని చెబుతూ వచ్చింది. అతడు నిజమే అనుకొని.. అర్ధం చేసుకున్నాడు. కానీ వారం రోజులు దాటినా అదే కారణం చెబుతోంది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఇంటి నుంచి మాయమైంది. నగలు, డబ్బులతో పారిపోయింది. ఆమె కోడలు కాదు.. దొంగ పెళ్లి కూతురు అని అత్తింటికి వారికి అప్పుడు అర్ధమైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇండోర్‌కు చెందిన రాహుల్‌కు లలిత అనే యువతితో ఇటీవలే పెళ్లయింది. కానీ శోభనం మాత్రం జరగలేదు. పెళ్లి తర్వాత రాహుల్‌ని ఆమె దగ్గరకు రానివ్వలేదు. పీరియడ్స్ కోసం సాకులు చెబుతూ దూరం పెడుతూ వచ్చింది. అనంతరం ఏడు రోజుల తర్వాత బంగారు ఆభరణాలతో పాటు మూడు లక్షల రూపాయల నగదుతో పారిపోయింది. తాము మోసపోయామని తెలుసుకున్న తర్వాత.. రాహుల్ ఫ్యామిలీ పోలీసులను ఆశ్రయించింది. లలిత అనే యువతి పెళ్లి పేరుతో మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఐతే పోలీసులకు మాత్రం ఓ విషయం స్పష్టమైంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దొంగ పెళ్లిళ్ల ముఠానే ఈ పనిచేసిందని తెలిసింది. కాజల్ అలియాస్ జ్యోతి, రాధేశ్యామ్ అనే వ్యక్తులు తమ కుమారుడిని కలిశారని.. వారి మధ్యవర్తిత్వంతోనే పెళ్లి జరిగిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. రాధేశ్యామ్ ఇంటికి వెళ్లి చూస్తే.. అక్కడ వారిద్దరు సన్నిహితంగా ఉన్నారని చెప్పారు. వారిని చూసి గొడవ పెట్టుకున్నామని.. కానీ అంతలోనే తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయారని పేర్కొన్నారు. ఆమె స్వస్థలం ఛత్తీస్‌గఢ్ అని గుర్తించి పోలీసులు.. అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. దీని వెనక చాలా మంది వ్యక్తుల ప్రమేయం ఉందని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దొంగ పెళ్లిళ్ల ముఠా కొన్నిరోజులుగా ఇలాంటి మోసాలు చేస్తోందని పోలీసులు పేర్కొన్నారు. అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండి.. పెళ్లి జరగకుండా ఇబ్బందులు పడుతున్న యువతను టార్గెట్ చేసి.. వారికి అమ్మాయిలను ఎరవేస్తున్నారు. పెళ్లి సంబంధం చూపించినందుకు డబ్బులు కూడా వసూళ్లు చేస్తున్నారు. ఎదురు కట్నం కూడా తీసుకుంటున్నారు. అనంతరం పెళ్లైన తర్వాత.. ఐదారు రోజులు అత్తింట్లో ఉండి.. ఆ తర్వాత పారిపోయింది. పోతూ పోతూ..బంగారు ఆభరణాలు, డబ్బును ఎత్తుకెళ్లింది. ఉత్తరాదిన యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.