Home /News /crime /

INDONESIAN WOMAN FINDS OUT 10 MONTHS AFTER MARRIAGE THAT HER HUSBAND IS A WOMAN READ THAT AGAIN PAH

డేటింగ్ యాప్ లో పరిచయం.. పెళ్లైనప్పటి నుంచి మొగుడు దూరంగా ఉంటున్నాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indonesia: డేటింగ్ యాప్ లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. ఒకరి అభిరుచులు మరోకరితో పంచుకున్నారు. అభిప్రాయాలు కలవడంతో పెళ్ళి కూడా చేసుకున్నారు.

కొందరు డేటింట్ యాప్ (Dating app)  లు, సోషల్ మీడియాలలో మహిళలను మోసం చేస్తున్నారు. అసలు,అవతల వ్యక్తి ఆడ, మగ కూడా తెలియకుండా మోసపోతున్నారు. కొంత మంది కేటుగాళ్లు ఆడవాళ్ల మాదిరిగా మాట్లాడుతూ.. అబ్బాయిలకు గాలం వేస్తున్నారు. వలపు వల వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది డేటింగ్ యాప్ లో అమ్మాయిలు కూడా మోస పోతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఈ ఘటన ఇండోనేషియాలో (Indonesia)  వెలుగులోనికి వచ్చింది. ఒక మహిళకు డేటింగ్ యాప్ తరచుగా యాక్టివ్ గా ఉండేది. ఈ క్రమంలో ఆమెకు.. ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు చాలా రోజుల పాటు చాటింగ్ చేసుకున్నారు. అభిప్రాయాలను పంచుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఫోన్ నంబర్ లను కూడా ఇచ్చుకున్నారు. కొన్ని సార్లు కలుసుకున్నాడు. ఈ క్రమంలో.. వీరి ఫ్రెండ్ షిప్ కాస్త.. ప్రేమగా మారింది. అవతలి వ్యక్తి.. తాను.. ఒక సర్జన్ అని, దీనితో పాటు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయని చెప్పుకున్నాడు. దీంతో... యువతి టెమ్ట్ అయ్యింది. ఇంట్లో చెప్పకుండా సీక్రెట్ గా వీరు పెళ్లి చేసుకున్నారు.



పెళ్లి  (Marriage) తర్వాత యువతి.. తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుంది. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ అబ్బాయి మాత్రం వింతగా ప్రవర్తించేవాడు. పెళ్లి తర్వాత డబ్బుల కోసం తరచూ సదరు వరుడు.. తన భార్య, ఆమె కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేక.. సదరు యువతి ఆమె కుటుంబం నుంచి దాదాపు రూ.15 లక్షల ను తన భర్త కుటుంబానికి ఇచ్చింది. ఈ క్రమంలో కొన్ని నెలల పాటు అతను భార్యను దూరంగా పెట్టాడు. రాత్రికి దగ్గరకు రానిచ్చేవాడు కాదు.

కేవలం డబ్బుల కోసం మాత్రమే ఇలా చేస్తున్నాడని డబ్బులు కూడా ఇచ్చింది. అయితే, అసలు విషయం యువతికి తర్వాత తెలిసింది. అసలు.. అతను మగవాడు కాదనే విషయం ఆలస్యంగా తెలిసింది. దీంతో తాను.. మోసపోయానని గ్రహించిన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీరికి పెళ్లి జరిగినట్లు ఎలాంటి చట్టపరమైన డాక్యుమెంట్స్ కూడా లేవు. ప్రస్తుతం కేసు స్థానికంగా ఉన్న కోర్టులో ఉంది. ప్రస్తుతం ఈ వింత ఘటన నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Dating App, Female harassment, Indonesia

తదుపరి వార్తలు