పెళ్లికి ముందే శృంగారం... జంటకు కఠిన శిక్ష

వీరిని శిక్షించడానికి ఓ వేదిక ఏర్పాటు చేశారు. మొదట యువతిని స్టేజ్‌పై నిలబెట్టి బెత్తంతో కొట్టడం ప్రారంభించారు.

news18-telugu
Updated: August 2, 2019, 8:05 AM IST
పెళ్లికి ముందే శృంగారం... జంటకు కఠిన శిక్ష
నమూనా చిత్రం
  • Share this:
పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొందని... ఓ జంటకు కఠినంగా శిక్షించారు. అబ్బాయి, అమ్మాయి వీపుపై వంద బెత్తం దెబ్బలతో చావబాదారు. ఈ ఘటన ఇండోనేషియాలోని అకే ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. వివారల్లోకి వెళ్తే.... ఇండోనేషియా... అకే ప్రావిన్స్‌కు చెందిన ఓ ప్రేమికుల జంట వివాహం చేసుకోకుండానే... శృంగారం చేస్తూ పట్టుబడ్డారు. అక్కడ షరియా చట్టాల్ని ఉల్లంఘిస్తూ పెళ్లికి ముందే శృంగారం చేయడం నేరం. దీంతో షరియా అధికారులు వారికి వంద బెత్తం దెబ్బలను శిక్షగా విధించారు. వీరిని శిక్షించడానికి ఓ వేదిక ఏర్పాటు చేశారు. మొదట యువతిని స్టేజ్‌పై నిలబెట్టి బెత్తంతో కొట్టడం ప్రారంభించారు. దెబ్బలు తట్టుకోలేక యువతి కన్నీరుమున్నీరుగా విలపించింది. షరియా అధికారుల్ని తనను విడిచిపెట్టాలని వేడుకోంది. అయినా అధికారులు పట్టించుకోలేదు. యువతి ఆరోగ్య పరిస్థితిని చూసుకుంటూ... వంద దెబ్బలు కొట్టడం పూర్తిచేశారు.

ఇక ఆ తర్వాత ఆమె ప్రియుడికి కూడా అదే శిక్ష విధించారు. ముస్లీం జనాభా ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో జూదాం, మద్యంసేవించడం,స్వలింగ సంపర్కం,పెళ్లికి ముందే శృంగారం వంటివి చేస్తే.. నేరంగా పరిగణిస్తూ... షరియా అధికారులు శిక్షలు విధిస్తారు. ఇలా చేసినవారందరికీ బెత్తంతో వంద దెబ్బలు కొడతారు. గత మార్చిలో కూడా ఓ జంటకు ఇలాంటి శిక్షే విధించారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడిచిన ఓ అవివాహిత జంటకు కూడా బెత్తంతో వీపు విమానం మోత మోగించారు.
First published: August 2, 2019, 8:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading