ఇండిగో విమానం ఇంజిన్‌లో మంటలు.. మంత్రి సహా 180 మంది పాసింజర్ల హాహాకారాలు...

బయలుదేరిన 20 నిమిషాల తర్వాత విమానం ఎడమవైపు ఇంజిన్‌‌లో నుంచి మంటలు రావడం ప్రారంభించాయి. ఇంజిన్‌లో నుంచి మంటలు రావడం గమనించిన ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు వేశారు.

news18-telugu
Updated: September 30, 2019, 10:56 AM IST
ఇండిగో విమానం ఇంజిన్‌లో మంటలు.. మంత్రి సహా 180 మంది పాసింజర్ల హాహాకారాలు...
ఇండిగో విమానం(File)
  • Share this:
ఇండిగో విమానం ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. దీంతో అందులో ఉన్న 180 మంది ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఆ ప్రయాణికుల్లో ఓ మంత్రి కూడా ఉన్నారు. గోవా నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. గోవా నుంచి బయలుదేరిన 20 నిమిషాల తర్వాత విమానం ఎడమవైపు ఇంజిన్‌‌లో నుంచి మంటలు రావడం ప్రారంభించాయి. ఇంజిన్‌లో నుంచి మంటలు రావడం గమనించిన ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు వేశారు. హాహాకారాలు చేశారు. ఆ సమయంలో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. వెంటనే ఇంజిన్‌ను ఆఫ్ చేసేశాడు. ఆ తర్వాత మరో ఇంజిన్ సాయంతో విమానాన్ని వెనక్కు మళ్లించాడు. గోవా విమానాశ్రయంలో దిగే వరకు ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అందులో ఉన్న 180 మంది ప్రయాణికుల్లో గోవా మంత్రి నీలేష్ కాబ్రల్ కూడా ఉన్నారు. పైలెట్ చాలా తెలివిగా వ్యవహరించి 180 మంది ప్రాణాలు కాపాడారని మంత్రి నీలేష్ తెలిపారు. ఆ తర్వాత రాత్రి 12.40 గంటలకు మరో విమానంలో ప్రయాణికులు ఢిల్లీ వెళ్లారు. మరికొందరు మాత్రం వేరే ఫ్లైట్‌లో వెళ్లిపోయారు. అయితే, దీనిపై ఎయిర్‌లైన్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
First published: September 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading