నాలుక పీకేస్తోందని విమానంలోనే దమ్ముకొట్టాడు... చివరకు

గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో 6E-637 విమానంలో నరేంద్ర సింగ్ అనే వ్యక్తి ఎక్కాడు. విమానం గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఫ్లైట్ టాయిలెట్‌లోకి వెళ్లి గుప్పు గుప్పున సిగరెట్ తాగడం మొదలుపెట్టాడు.

news18-telugu
Updated: March 15, 2019, 9:27 PM IST
నాలుక పీకేస్తోందని విమానంలోనే దమ్ముకొట్టాడు... చివరకు
ఇండిగో విమానం (File photo)
  • Share this:
సిగరెట్ తాగకుండా ఉండలేకపోయిన ఓ ప్రయాణికులు చివరకు విమానంలోనే దమ్ముకొట్టి తోటి పాసింజర్లలో భయం పుట్టించాడు. గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో 6E-637 విమానంలో నరేంద్ర సింగ్ అనే వ్యక్తి ఎక్కాడు. విమానం గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఫ్లైట్ టాయిలెట్‌లోకి వెళ్లి గుప్పు గుప్పున సిగరెట్ తాగడం మొదలుపెట్టాడు. అయితే, ఏదో ప్రమాదం జరుగుతుందని భావించిన సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పైలెట్‌కు చేరవేశారు. పైలెట్ వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేశాడు. విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇండిగో స్టాఫ్ ఇచ్చిన ఫిర్యాదుతో అతడి మీద పలు కేసులు నమోదు చేశారు. గతంలో కూడా ఇండిగో విమానంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ పట్టుబడ్డాడు. అహ్మదాబాద్ నుంచి గోవా వెళ్తున్న విమానంలో గత ఏడాది క్రిస్మస్ రోజు దమ్ముకొడుతూ విమాన సిబ్బందికి పట్టుబడ్డాడు.
First published: March 15, 2019, 9:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading