హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: దుబాయ్ లో భారత మహిళకు వేధింపులు.. స్వదేశానికి రాగానే ఊహించని సర్ ఫ్రైజ్..

OMG: దుబాయ్ లో భారత మహిళకు వేధింపులు.. స్వదేశానికి రాగానే ఊహించని సర్ ఫ్రైజ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubai: దుబాయ్ లో ఒక వ్యక్తి షేక్ ఇంట్లో పనిచేసే మహిళ ఫోన్ నంబర్ సంపాదించాడు. తరచుగా ఆమెతో చాట్ చేసేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా, అసభ్య మెసెజ్ లు, వీడియోలను కూడా పంపుతున్నాడు.

కొందరు మొదట మంచివారిలానే ఉంటారు. బాగానే ఉన్నాడని మాట్లాడితే.. ఇక వారి అసలు రంగు చూపిస్తుంటారు. ప్రధానంగా మహిళలు, అమ్మాయిలు చాలా చోట్ల ఇలాంటి ఘటనలను (Harassment) ఎదుర్కొంటున్నారు. అవతలి వారిని నమ్మి ఫోన్ నంబర్ ఇస్తే.. ఆ తర్వాత అసభ్య మోసెజ్ లు, అశ్లీల వీడియోలు పంపుతూ పైశాచికంగా ప్రవర్తిస్తారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh)  సాహెబ్ అలీ అనే వ్యక్తి దుబాయ్ లో షేక్ వద్ద పనిచేసేవాడు. ఇతనికి అక్కడే పనిచేస్తున్న మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె కూడా యూపీకి చెందినది. దీంతో పరిచయం కాస్త, స్నేహంగా మారింది. ఇద్దరు తరచుగా మాట్లాడుకునే వారు. ఫోన్ నంబర్ లను ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో.. కొన్ని రోజులకు సాహెబ్ అలీ, మహిళలను వేధించడం మొదలు పెట్టాడు. ఆమెకు అసభ్య మెసెజ్ లు, అశ్లీల వీడియోలను (Harassment) పంపేవాడు. దీంతో సదరు మహిళ విసిగిపోయింది. ఈ క్రమంలో ఆమె భారత్ కు వచ్చేసింది. ఆ తర్వాత.. నిందితుడు కూడా అతని గ్రామానికి రావడానికి దుబాయ్ నుంచి బయల్దేరాడు. మహిళ అప్పటికే స్థానిక పోలీసులకు సాహెబ్ పై ఫిర్యాదు చేసింది. వెంటనే వారు.. ఢిల్లీలో సాహెబ్ అలీని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఉత్తర ప్రదేశ్ గతంలో (Uttar pradesh)  అమానుషం చోటు చేసుకుంది.

లలిత్ పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. గత నెల ఏప్రిల్ 22 న 13 ఏళ్ల బాలికను కొందరు ప్రలోభ పెట్టి భోపాల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఒక గదిలో బంధించారు. నలుగురు కలసి నాలుగు రోజుల పాటు  (Rape on girl) అత్యాచారం చేశారు. ఆ తర్వాత.. తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆమె ఇంటి దగ్గర వదిలేసి నిందితులు పారిపోయారు. అప్పటికే తమ కూతురి ఆచూకీ కోసం వారు వెతుకుతున్నారు.

బాధితురాలు జరిగిన దారుణాన్ని ఇంట్లో వారికి చెప్పింది. దీంతో వారు పోలీసు స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే, స్టేషన్ అధికారి తిలకధారి ఆమెపై కన్నేశాడు. రెండోరోజు ఆమెను స్టేట్ మెంట్ రికార్డు చేయాలని స్టేషన్ కు రప్పించాడు. ఆమె అత్త ముందే.. ఆమెను సెల్ లోనికి తీసుకెళ్లి రేప్ చేశాడు. దీంతో బాధితురాలు షాకింగ్ కు గురయ్యింది. ఆ తర్వాత... వారు ఉన్నతాధికారులకు వెళ్లి జరిగిన దారుణాన్ని తెలిపారు. దీంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

వెంటనే స్టేషన్ హౌస్ అధికారిని తిలక్ ధారిని సస్పెండ్ చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి అధికారులు ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. ఇప్పటికే రేప్ చేసిన నలుగురు నిందితులలో ఒకరిని లలిత్ పూరి ఎస్పీ నిఖిల్ పాఠక్ వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Harassment, Harassment on women, Uttar pradesh

ఉత్తమ కథలు