• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • INDIAN WHO FLED UK AFTER SEXUALLY ASSAULTING WOMAN GIVEN SEVEN YEAR JAIL TERM FOR RAPE IN BRITAIN BS

రేపిస్టును పట్టించిన ఇయర్‌ఫోన్స్.. అత్యాచారం చేసినందుకు..

రేపిస్టును పట్టించిన ఇయర్‌ఫోన్స్.. అత్యాచారం చేసినందుకు..

ప్రతీకాత్మక చిత్రం

అజయ్ రానా(35) అనే ప్రవాసుడు 2017 డిసెంబరు 9న కారులో వెళ్తుండగా ఓ యువతి నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. చలిగా ఉందని, తాను లిఫ్ట్ ఇస్తానని ఆమెను నమ్మించాడు. సరేనని కారు ఎక్కిన ఆ యువతిని ఓ చోటుకు తీసుకెళ్లి రేప్ చేశాడు.

  • Share this:
కారులో లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఓ యువతిని ఎక్కించుకొని, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రవాస భారతీయుడు. అయితే, ఘటన జరిగి రెండేళ్లయినా తాజాగా అతడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది యూకే కోర్టు. వివరాల్లోకెళితే.. అజయ్ రానా(35) అనే ప్రవాసుడు 2017 డిసెంబరు 9న కారులో వెళ్తుండగా ఓ యువతి నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. చలిగా ఉందని, తాను లిఫ్ట్ ఇస్తానని ఆమెను నమ్మించాడు. సరేనని కారు ఎక్కిన ఆ యువతిని ఓ చోటుకు తీసుకెళ్లి రేప్ చేశాడు. ఆ యువతి అతడి చెర నుంచి తప్పించుకొని దగ్గరలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి ఆమె సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఇంతలో, తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి అజయ్ భారత్‌కు వచ్చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాలా రోజుల పాటు అతడి ఆచూకీ కోసం గాలించారు. చివరకు కారును గుర్తించినా అది అతడికి కాదని తేలింది. కారులో దొరికిన ఇయర్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకుని, మహిళ ఒంటిపై ఉన్న డీఎన్‌ఏను, ఇయర్‌ఫోన్స్‌పై ఉన్న డీఎన్ఏను పరిశీలించగా ఒక్కరిదే అని తేలింది. దీంతో అజయే దోషి అన నిర్ధారించుకున్న పోలీసులు.. అజయ్‌పై యురోపియన్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు.

అంటే.. యూకే సహా యూరప్‌లోని ఏ దేశానికి వెళ్లినా నిందితుడిని అరెస్టు చేయొచ్చు. అది తెలియని అజయ్.. ఈ సారి స్పెయిన్‌కు వెళ్లాడు. అది తెలిసిన స్పెయిన్ పోలీసులు గత ఏడాది నవంబరులో అరెస్టు చేసి యూకే పోలీసుల రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు అతడి నేరంపై విచారణ జరగ్గా తాను నేరం చేసినట్టు కోర్టులో ఒప్పుకున్నాడు. దీంతో అక్కడి కోర్టు అజయ్‌కు ఏడేళ్ల శిక్షను విధించింది. శిక్షానంతరం అక్కడి ప్రభుత్వం అజయ్‌ను తిరిగి భారత్‌కు పంపనుంది.
First published: