Indian Student Shot Dead : కెనడాలో ఘోరం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ విద్యార్థి మృతిచెందాడు. కెనడా రాజధాని టొరంటోలోని సబ్‌వే స్టేషన్ ప్రవేశం వద్ద ఈ నెల 7న ఈ ఘటన జరిగింది. మృతుడిని ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన కార్తీక్ వాసుదేవ్(21)గా గుర్తించారు. గరువారం సాయంత్రం సెయింట్ జేమ్స్ టౌన్ లో మెట్రో సబ్ వే స్టేషన్ ఎంట్రన్స్ గేట్ వద్దకు చేరుకున్న కార్తీక్ పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
తీవ్ర బుల్లెట్ గాయాలైన కార్తీక్ ను హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ కార్తీక్ మరణించాడు. అయితే కార్తీక్ పై కాల్పులు జరిపింది ఎవరు, ఎందుకు కాల్పులు జరిపారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు చెప్పారు. కాగా,కార్తిక్ ఈ ఏడాది జనవరిలో టొరంటో వెళ్లాడు. సెనెకా కాలేజీలో మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు. అక్కడ పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు.
ALSO READ Sri Lanka Crisis : ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడాలంటే..అదొక్కటే దారి
కార్తీక్ మృతి పట్ల కెనడాలోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతడి అవశేషాలను వీలైనంత త్వరగా భారత్ కు పంపించేందుకు సహకరిస్తామని తెలిపింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా విద్యార్థి మృతి పట్ల సంతాపం తెలిపారు. "ఈ విషాద సంఘటనతో బాధపడ్డాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి" అని జైశంకర్ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.