Video: రైలు ఫుట్ బోర్డ్‌పై స్టంట్... ఓ యువకుడి ప్రాణం తీసింది

Indian Railways | రైలు లోపలి ప్రయాణికులు చూస్తుండగానే రైలు పట్టాల పక్కన ఉన్న స్తంభం ఆ యువకుడిని ఢీ కొట్టింది. అంతే... పట్టు కోల్పోయిన దిల్షాన్ రైలు పట్టాలపై పడిపోయాడు. తీవ్ర గాయాలతో ప్రాణాలు వదిలాడు.

news18-telugu
Updated: December 30, 2019, 1:20 PM IST
Video: రైలు ఫుట్ బోర్డ్‌పై స్టంట్... ఓ యువకుడి ప్రాణం తీసింది
Video: రైలు ఫుట్ బోర్డ్‌పై స్టంట్... ఓ యువకుడి ప్రాణం తీసింది (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైలులో, బస్సులో ప్రయాణించేప్పుడు యువకుల స్టంట్లు, విన్యాసాలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఫుట్ బోర్డ్ ప్రయాణం ప్రమాదకరమని బస్సుల్లో, రైళ్లల్లో పోస్టర్లు ఉన్నా... యువకులు వాటిని పట్టించుకోరు. ఫుట్‌బోర్డ్‌పై విన్యాసాలు చేస్తుంటారు. నిర్లక్ష్యంగా ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ముంబైలో డిసెంబర్ 26న ఇలాంటి ఘటనే జరిగింది. దిల్షాన్ అనే యువకుడు ముంబై లోకల్ ట్రైన్ ఎక్కాడు. లోపల కూర్చోకుండా రైలులో ఫుట్‌బోర్డ్‌పై విన్యాసాలు చేశాడు. రైలు వేగంగా వెళ్తున్నా పట్టించుకోలేదు. అలాగే నిర్లక్ష్యంగా స్టంట్స్ చేస్తూనే ఉన్నాడు. లోపల ఉన్న ఓ వ్యక్తి ఆ స్టంట్‌ను వీడియో తీశాడు. రైలు లోపలి ప్రయాణికులు చూస్తుండగానే రైలు పట్టాల పక్కన ఉన్న స్తంభం ఆ యువకుడిని ఢీ కొట్టింది. అంతే... పట్టు కోల్పోయిన దిల్షాన్ రైలు పట్టాలపై పడిపోయాడు. తీవ్ర గాయాలతో ప్రాణాలు వదిలాడు.

ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రైళ్లల్లో విన్యాసాలు చేయొద్దని రైల్వే ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించినా వినకుండా ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ వీడియోను ట్వీట్ చేసింది. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయకూడదని హెచ్చరించింది. రైళ్లల్లో ఇలాంటి స్టంట్స్ చేయడం ప్రమాదకరం మాత్రమే కాదని, నేరం కూడా అని హెచ్చరించింది. రైళ్లల్లో ఇలాంటి విన్యాసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవారెందరో ఉన్నారు. అయినా ఆకతాయిలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలా ప్రమాదాలబారిన పడుతున్నారు. ముంబైలో ప్రమాదం ఎలా జరిగిందో ఈ వీడియో చూడండి.

VIDEO: రైలు ఫుట్ బోర్డ్‌పై విన్యాసం... చివరికి ఏం జరిగిందో చూడండి





ఇవి కూడా చదవండి:

IRCTC Tejas Express: మరో కొత్త రూట్‌లో ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ పరుగులు... ఎప్పట్నుంచో తెలుసా?

Railway Jobs: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ పరీక్ష రాయాల్సిందేSpecial Trains: సంక్రాంతికి ఊరెళ్లేవారికి ప్రత్యేక రైళ్లు... టైమింగ్స్ ఇవే

 
First published: December 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు