London: లండన్ లో భారత సంతతికి చెందిన యువతి.. వసతి గృహంలో తీవ్ర గాయాలపాలై, అచేతనంగా పడుండటాన్ని ఆమె స్నేహితులు గమనించారు. ఆమె మెడ, శరీర భాగాలపై గాయాలున్నాయి. ప్రస్తుతం ఈ సంఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.
మనలో చాలా మంది విదేశాలకు, ఉన్నత చదువులకు, ఉద్యోగాల కోసం వెళ్తుంటారు. ఇలాంటి వారికి, మనదేశంలో కంటె ఎక్కువగా శాలరీలు ఇచ్చి మరీ వారిని ఉద్యోగాలలో చేర్చుకుంటారు. అందుకే విదేశాలలో చదువుకోవడానికి మనలో ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తారు. అదే విధంగా, అక్కడే ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో ఒక్కొసారి మనవారిపై, విదేశీయులు దాడులు చేసిన ఘటన అప్పుడప్పుడు వార్తలలో చూస్తుంటాం. అవి జాత్యహంకారం వలన లేదా.. మరేదో కారణాల వలన దాడులు చేస్తుంటారు. కొన్నిసార్లు మన వారిపై.. కాల్పులకు తెగబడిన సంఘటనలు మనకు తెలిసిందే.
తాజాగా, లండన్ లో (London) భారత సంతతికి చెందిన యువతిని క్రూరంగా హత్య చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర కలకంగా మారింది. అమెరికాలో లోని స్థానిక పోలీసుల ప్రకారం... లండన్ లోని క్లర్కెన్ వెల్ ప్రాంతంలో.. సబితా తన్వానీ అనే భారత సంతతికి చెందిన బ్రిటన్ దేశానికి చెందిన యువతి.. ఒక వసతి గృహంలో ఉంటుంది. ఆమెకు 19 ఏళ్లు. అక్కడే చదువు కుంటుంది. గత శనివారం.. ఆమె హస్టల్ లో చనిపోయి రూమ్ లో ఉండటాన్ని ఆమె స్నేహితులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సబితా తన్వానీ మెడపై గాయాలు ఉండటాన్ని గమనించారు.
వెంటనే ఇండియాలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సబితా తన్వానీ.. స్నేహితులు మహేర్ మారూఫ్ పై అనుమానం వ్యక్తం చేశారు. సబితా తన్వానీ చనిపోయినప్పటి నుంచి అతను మాయమయ్యాడు. దీంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ట్యూనీషియా దేశానికి చెందిన వాడిగా గుర్తించారు. పోలీసులు విచారణలో అతను, సబితా తో పాటు చదువుకునే విద్యార్థికాదని తెలిసింది.
యువతిని హత్య చేయడానికి వారి మధ్య ప్రేమ వ్యవహరం కారణమా.. మరేదైనా కారణమా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి మృతదేహాన్ని తరలించడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసుల బృందంతో గాలింపు చేపట్టారు. నిన్న ఆదివారం నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోనికి వస్తాయని లండన్ పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, London