ఉబర్ కారు డ్రైవర్ నిర్వాకం.. ‘మీటర్ రీడింగ్’ పెంచుకోవడం కోసం....

కారు ఎక్కిన తర్వాత ఆ మహిళ వెనుక సీట్లో కునుకుతీసింది. దీన్ని ఆసరాగా చేసుకున్న పార్మర్.. ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని అప్లికేషన్‌లో ఆమె వెళ్లాల్సిన గమ్యస్థానాన్ని మార్చేశాడు.

news18-telugu
Updated: March 15, 2019, 12:50 PM IST
ఉబర్ కారు డ్రైవర్ నిర్వాకం.. ‘మీటర్ రీడింగ్’ పెంచుకోవడం కోసం....
ప్రతీకాత్మక చిత్రం (Photo: Reuters)
  • Share this:
కొందరు ఆటో డ్రైవర్లు మీటర్ రీడింగ్ పెంచుకోవడం కోసం దగ్గరగా ఉన్న మార్గాన్ని వదిలేసి, చుట్టూ తిప్పి తీసుకెళతారని జనంలో ఓ భావన ఉంది. అయితే, అది ఇండియాలోనే కాదు. విదేశాల్లో కూడా జరిగింది. అయితే, అలా చేసింది కూడా ఓ భారతీయుడే. అమెరికాలో ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న హర్బీర్ పార్మర్ (25), తన కారు మీటర్ రీడింగ్ పెంచుకుని ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం ఓ మహిళను కిడ్నాప్ చేసినట్టు కోర్టు తేల్చింది. పార్మర్ అనే వ్యక్తి న్యూయార్క్ సిటీలో ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2018 ఫిబ్రవరిలో ఓ మహిళ అతడి కారు ఎక్కి తాను ఎక్కడికి వెళ్లాలో తెలిపింది. మొబైల్ యాప్‌లోనే అంతా ట్రాకింగ్ జరుగుతోంది. అయితే, కారు ఎక్కిన తర్వాత ఆ మహిళ వెనుక సీట్లో కునుకుతీసింది. దీన్ని ఆసరాగా చేసుకున్న పార్మర్.. ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని అప్లికేషన్‌లో ఆమె వెళ్లాల్సిన గమ్యస్థానాన్ని మార్చేశాడు. ఆమె దిగాల్సిన చోటు కంటే మరో 60 మైళ్ల దూరం తీసుకెళ్లాడు.

Uber Free Calls, Uber new features, Uber VoIP, Uber app VoIP, Voice over Internet Protocol, uber free calling, uber safe calling, ఊబెర్ సేఫ్ కాలింగ్, ఊబెర్ ఫ్రీ కాలింగ్, ఊబెర్ ఫ్రీ కాల్స్
ప్రతీకాత్మక చిత్రం


నిద్రలేచిన తర్వాత మహిళ తాను దిగాల్సిన చోటు అదికాదని వాదించింది. అయితే, యాప్‌లో అలానే ఉందంటూ అతడు వాదించాడు. తనను తాను దిగాల్సిన చోటకైనా తీసుకెళ్లాలి. లేదంటే, పోలీస్ స్టేషన్‌కి అయినా తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. అందుకు కూడా ససేమిరా అన్న పార్మర్.. ఆమెను నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు సమీపంలోని ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కిడ్నాప్ కేసు పెట్టింది. సుమారు ఆరు నెలల తర్వాత 2018 అక్టోబర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది. అయితే, జైలు శిక్ష ఎంత విధిస్తారనే అంశం త్వరలో తేలనుంది. 20 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 15, 2019, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading