అమెరికాలో (America) గన్ కల్చర్ మారణ హోమం ఆగడం లేదు. ఇప్పటికే అనేక మంది దుండగులు జరిపిన కాల్పులలో మరణించారు. గతంలో పాఠశాలలో, స్కూల్ లో, దుండగులు జరిపిన కాల్పులలో వందలాది మంది చనిపోయారు. ఆ తర్వాత కూడా కాల్పుల (Gun culture) సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన న్యూయార్క్ లో గత శనివారం జరిగింది.
పూర్తి వివరాలు.. న్యూయార్క్ లోని సౌత్ ఓజోన్ పార్క్ లో భారతీయ సంతతి చెందిన వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాగా, సత్నామ్ సింగ్ అనే (31) ఏళ్ల వ్యక్తి తన ఎస్ యూవీ వాహనంలో కూర్చున్నాడు. అప్పుడు ఒక దుండగుడు వచ్చాడు. వచ్చి రావడంతో కారులో ఉన్న సత్నామ్ సింగ్ పై (Indian origin) ఇష్టమోచ్చినట్లు కాల్పులు జరిపాడు. అతని మెడ, తల, ఛాతీ భాగాల్లో కాల్పులు జరిపాడు. దీంతో సత్నామ్ సింగ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. అధికారులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా గతంలోనే అమెరికాలో కాల్పులు జరిగాయి.
అమెరికా(America)లో తుపాకులు లైసెన్సులు చాలా ఈజీగా దొరుకుతాయి. తుపాకీ హింసను అరికట్టడం కోసం ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని కొందరు సమర్థిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ తుపాకీ హింస వల్ల ప్రతిరోజూ అమాయకులు చనిపోతున్నారు. ఇటీవలె మిచిగాన్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో 15 ఏళ్ల విద్యార్ధి కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులను చంపాడు. గాయపడిన వారిలో 17 ఏళ్ల బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాల్పుల్లో మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మరిచిపోకముందే అమెరికాలోని హ్యూస్టన్ (Houston)లో ఆగంతకులు కాల్పులు (Strangers Firing) జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు.
స్థానికంగా పండుగ (candlelight vigil)ను పురస్కరించుకుని ఇక్కడకు చేరిన ప్రజలపై ఆదివారం రాత్రి ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ మేరకు ఓ అధికారి సమాచారం అందించారు. బేటౌన్ నార్త్ మార్కెట్ లూప్ (North Market Loop in Baytown) సమీపంలో వేడుక కోసం దాదాపు 50 మంది వ్యక్తులు గుమిగూడిన సమయంలో సాయంత్రం 6.40 గంటలకు కాల్పులు జరిగినట్లు హారిస్ కౌంటీ షెరీఫ్ ఎడ్ గొంజాలెజ్ (Ed Gonzalez, head of the Harris County Sheriff’s Office) తెలిపారు.
ఈ ప్రజలు సంబరాలు (candlelight vigil) చేసుకుంటున్నారని మరియు గాలిలో బెలూన్‌లను వదులుతున్నారని, ఒక వాహనం అక్కడికి చేరుకుని గుంపుపైకి కాల్పులు (gunfire against vigil) జరిపిందని అతను చెప్పాడు. మరణించిన వ్యక్తికి సుమారు 20-22 సంవత్సరాల వయస్సు ఉంటుందని గొంజాలెజ్ సోమవారం ఉదయం చెప్పారు. గాయపడిన ముగ్గురిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Crime news, Gun fire, USA