మహిళ మత్తులో ఉందని.. ఆమెను ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి..

డ్రగ్స్ మత్తలో ఉన్న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ప్రవాస భారతీయుడికి సింగపూర్ కోర్టులో శిక్ష పడింది. ఆరున్నరేళ్ల పాటు అతడికి జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం సోమవారం తీర్పునిచ్చింది.

news18-telugu
Updated: September 5, 2019, 2:05 PM IST
మహిళ మత్తులో ఉందని.. ఆమెను ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
డ్రగ్స్ మత్తలో ఉన్న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ప్రవాస భారతీయుడికి సింగపూర్ కోర్టులో శిక్ష పడింది. ఆరున్నరేళ్ల పాటు అతడికి జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం సోమవారం తీర్పునిచ్చింది. వివరాల్లోకెళితే.. తిరుచెల్వమ్ మనియమ్(40) అనే ప్రవాసుడు గత ఏడాది ఏప్రిల్ 20న సింగపూర్‌లో ఓ బస్‌స్టాప్‌లోని బెంచిపై మత్తులో పడివున్న జంటను చూశాడు. ముప్పై ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిని చూసిన అతడు ఎవరూ లేని చోటుకు ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంతలో ఆమెకు మెలకువ వచ్చి సహాయం కోసం అరిచింది. దీంతో మనియమ్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

అప్పటి నుంచి విచారణ జరుగుతూ వస్తుండగా ఇప్పటికి ఈ కేసులో తీర్పు వెలువడింది. నిందితుడు తాను చేసిన నేరాన్ని కోర్టులో అంగీకరించడంతో.. జైలు శిక్ష విధిస్తూనే అతడిని మూడు సార్లు కర్రతో గట్టిగా కొట్టాలంటూ జడ్జి తీర్పునిచ్చారు. దీంతో సోమవారం అధికారులు మనియమ్‌ను పెద్ద కర్రతో తన తప్పు తెలుసుకునేలా మూడు దెబ్బలు చరిచి, కటకటాల్లోకి నెట్టారు.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>