news18-telugu
Updated: December 11, 2019, 2:59 PM IST
డా.మనీష్ షా (File Photo)
లండన్‌లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ డాక్టర్ వైద్య వృత్తికే కళంకం తెచ్చాడు. వైద్యుడి ముసుగులో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. తన వద్దకు వచ్చే మహిళా పేషెంట్లను క్యాన్సర్ పేరు చెప్పి భయపెట్టేవాడు. హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ క్యాన్సర్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పేవాడు. అలా అవసరం లేకపోయినా సదరు మహిళా పేషెంట్లకు యోని పరీక్షలు,వక్షోజాల పరీక్షలు నిర్వహించేవాడు. ఇదే క్రమంలో పలువురిపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. లండన్‌లో పనిచేస్తున్న మనీష్ షా(50) అనే ఆ జనరల్ ప్రాక్టీషనర్‌ను కోర్టు దోషిగా తేల్చింది. అవసరం లేకపోయినా.. పలువురు మహిళలకు మనీష్ షా యోని,వక్షోజాల పరీక్షలు నిర్వహించినట్టు న్యాయవాది కేట్ బెక్స్ తెలిపారు. ట్రీట్మెంట్ పేరుతో పేషెంట్స్‌కు ముద్దులు, ఆలింగనాలు ఇచ్చేవాడన్నారు.
2009 నుంచి 2013వరకు ఐదేళ్ల కాలంలో ఆరుగురు పేషెంట్స్‌పై అతను లైంగిక దాడికి పాల్పడినట్టుగా నిర్దారించారు. ఇతని బాధితుల్లో 11 ఏళ్ల ఓ బాలిక కూడా ఉన్నట్టు గుర్తించారు. గతంలోనూ మరో 17 మంది మహిళలపై మనీష్ లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.దీంతో మొత్తం 23 మంది మహిళలపై మనీష్ షా లైంగిక దాడులకు పాల్పడినట్టు చార్జిషీట్ దాఖలైంది. మనీష్ షా కేసులపై వాదనలు విన్న న్యాయమూర్తి అన్నే మోలిన్యూక్స్ ఫిబ్రవరి 7,2020కి తీర్పును రిజర్వ్‌లో పెట్టారు.మరోవైపు మనీష్ షా మాత్రం తనపై ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నాడు.
Published by:
Srinivas Mittapalli
First published:
December 11, 2019, 2:55 PM IST