బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు..!! సింగపూర్ లో జైలుపాలైన భారతీయుడు

విదేశాలు, మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలుసు. లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేసినా అక్కడ కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే.

news18
Updated: October 21, 2020, 6:54 AM IST
బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు..!! సింగపూర్ లో జైలుపాలైన భారతీయుడు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 21, 2020, 6:54 AM IST
  • Share this:
అభివృద్ధి చెందిన దేశాలలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. భారత్ లో మాదిరిగా అక్కడ చట్టాల లోని లోపాలను బూచీగా ఉపయోగించుకుని తప్పించుకునే అవకాశం ఉండదు. చిన్న చిన్న నేరాలకు సైతం అక్కడ శిక్షలు భారీగా ఉంటాయి. ఇక లైంగిక వేధింపులు, రేప్ వంటి నేరాలకు.. దోషులకు ఊహించని శిక్షలుంటాయి. తన అంగీకారం లేకుండా ఒక మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్నందుకు గానూ ఒక వ్యక్తికి ఏడు నెలల జైలు శిక్ష పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగపూర్ లో వెలుగుచూసిన ఈ ఘటనలో నిందితుడు ఒక భారతీయుడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒక మీడియా కథనం ప్రకారం.. భారత్ కు చెందిన చెల్లం రాజేశ్ కన్నన్ సింగపూర్ లో భద్రతా సమన్వయకర్తగా పనిచేసేవాడు. అతడికి భార్య, కూతురు కూడా ఉన్నారు. అయితే రాజేశ్ కు గతేడాది సోషల్ మీడియాలో ఒక బాలిక(15) తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరుచూ మాట్లాడుకునేవాళ్లు. మెసేజ్ లు కూడా పంపుకునేవారు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో వారిద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆమెను కలుస్తానని చెప్పగా.. అందుకు ఆమె అంగీకరించింది. అయితే ఆ బాలికను కలుసుకోవడానికి మూడు రోజుల ముందు.. తన ఫ్రెండ్స్ కోసం మందు సీసాలు తీసుకురావాలని ఆమె రాజేశ్ ను కోరింది.

మందు బాటిల్స్ తీసుకురావడానికి ఒప్పుకున్న రాజేశ్.. తనకు ముద్దు ఇస్తేనే అవి తీసుకొస్తానని షరతు పెట్టాడు. దీనికి ఆమె తిరస్కరించింది. అయితే ఆమె అనుమతి లేకున్నా.. మందు బాటిల్స్ తీసుకెళ్లి ఆ బాలికను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు రాజేశ్. అంతేగాక తనతో సెక్స్ చేయాలని బలవంతపెట్టాడు. దీనికి ఆ బాలిక ప్రతిఘటించింది. ఆ తర్వాత నిందితుడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది.
ఈ కేసులో పోలీసులు రాజేశ్ ను అరెస్టు చేయడంతో ఆయన ఉద్యోగం ఊడింది. విచారణ సందర్భంగా రాజేశ్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను చేసిన పనికి సిగ్గు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. సింగపూర్ లో తాను మూడేళ్లుగా ఉంటున్నానని, కానీ తనమీద ఎలాంటి నేరారోపణలు లేవని కోర్టుకు తెలిపాడు.ఈ కేసుతో తన జీవితం తల్లకిందులైందని వాపోయాడు. తన ఉద్యోగం కోల్పోవడమే గాక.. కుటుంబం కూడా తనను వదిలివెళ్లిపోయిందని కోర్టు ముందు వాపోయాడు. 

విచారణ విన్న న్యాయమూర్తి.. బాధితురాలిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినందుకు గానూ అతడికి ఏడు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 18న అతడిని రిమాండ్ తేదీకి ఈ శిక్షను ఖరారు చేశారు. సింగపూర్ లో ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు గాని, రేప్ కు గాని పాల్పడితే.. అతడికి 10 వేల డాలర్ల వరకు జరిమానా లేదా ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉండొచ్చు.
Published by: Srinivas Munigala
First published: October 21, 2020, 6:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading