హోమ్ /వార్తలు /క్రైమ్ /

తల్లి అంత్యక్రియలకు పంపలేదని, యూఏఈలో బాస్‌ను 11 సార్లు కత్తితో పొడిచిన ‘భారతీయుడు’

తల్లి అంత్యక్రియలకు పంపలేదని, యూఏఈలో బాస్‌ను 11 సార్లు కత్తితో పొడిచిన ‘భారతీయుడు’

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తన తల్లి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా హాజరుకానివ్వలేదని, భారత్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో కోపం పట్టలేక దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు, తోటి ఇండియన్‌ను 11 సార్లు కత్తితో పొడిచాడు.

తన తల్లి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా హాజరుకానివ్వలేదని, భారత్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో కోపం పట్టలేక దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు, తోటి ఇండియన్‌ను 11 సార్లు కత్తితో పొడిచాడు. 25 సంవత్సరాల వ్యక్తి దుబాయ్‌లోని ఓ నిర్మాణ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆగస్టులో తన తల్లికి తీవ్ర అనారోగ్యంగా ఉందని అతడికి సమాచారం వచ్చింది. కాబట్టి, తాను ఇంటికి వెళ్లాలని తాను పనిచేసే కంపెనీలో పై అధికారికి తెలిపాడు. ఆ బాస్ కూడా భారతీయుడే. అయితే, తాను కంపెనీ మేనేజ్‌మెంట్‌కు చెబుతానని, తన చేతిలో ఏమీ లేదని చెప్పాడు. కానీ, భారత్ వెళ్లే వారి జాబితాలో ఆ కంపెనీ నుంచి 22 మంది పేర్లు వచ్చాయి. అందులో తన పేరు లేకపోవడంతో ఆ ఉద్యోగి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ విషయంపై తన పై అధికారితో వాగ్వాదానికి దిగారు. తన చేతిలో ఏమీ లేదని, అంతా కంపెనీ చూసుకుందని బాధితుడు సమాచారం ఇచ్చాడు. ఆ మాట విన్న తర్వాత నిందితుడు ఇంట్లోకి వెళ్లాడు. మళ్లీ క్షణాల్లోనే ఓ కత్తి తీసుకుని బయటకు వచ్చాడు. కసా కసా 11 సార్లు అతడిని పొడిచాడు. పొట్ట, ఛాతీలో పొడిచాడు. కానీ, బాధితుడి అదృష్టం బాగుండి, ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడిని దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు దుబాయ్ జైల్లో ఉన్నాడు. కత్తి పోట్లు తిన్న బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు. నిందితుడి మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

తల్లి అంత్యక్రియలను అడ్డుకున్న కొడుకు.. శవం ముందే ఆస్తి కోసం కొట్లాట

ఓ వైపు తల్లి చివరి చూపు కోసం కూడా పంపలేదని బాస్ మీద హత్యాయత్నం చేసిన ఘటన ఇలా ఉంటే, మరోవైపు కన్నతల్లి చనిపోతే, శవానికి తలకొరివి కూడా పెట్టకుండా ఆస్తి కోసం గొడవ పడిన ఘటన కూడా తాజాగా జరిగింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం జీల్గుల గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి రాజమ్మ(70) ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. ఇప్పటికే ఆస్తి పంపకాలు కూడా పూర్తయ్యాయి. మరో ఎకరన్నర భూమిని మాత్రం తన పేరిటే ఉంచుకుంది రాజమ్మ. ఈమె పెద్ద కుమారుడు సమ్మయ్య గతంలోనే మరణించాడు. ఆయన అంత్యక్రియలను రాజమ్మ పేరిట ఉన్న భూమిలోనే నిర్వహించారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజమ్మ... డిసెంబర్ 17న కన్నుమూసింది. ఆమె అంత్యక్రియల విషయంలో అన్నాదమ్ముళ్లు గొడవపడ్డారు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన చిన్నకుమారుడు రవీందర్ రచ్చ చేశాడు. తల్లి పేరిట ఉన్న భూమి తనదేనని.. అక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదని గొడవపెట్టుకున్నాడు. బంధువులు, గ్రామస్తులు నచ్చజెప్పినా వినలేదు. అసలు ఇక్కడ ఖననం చేయవద్దని వాగ్వాదానికి దిగాడు. చివరకు పోలీసులు చేరుకొని రవీందర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం రాజమ్మ అంత్యక్రియలను ఆమె పేరిట ఉన్న భూమిలోనే నిర్వహించారు. అంత్యక్రియలు చేసేందుకు రవీందర్ ముందుకు రాకపోవడంతో రెండో కుమారుడు జంపయ్య తల కొరివి పెట్టాడు.

First published:

Tags: UAE

ఉత్తమ కథలు