George Floyds of India: తమిళనాడు లాకప్ డెత్ కేసులో లేడీ కానిస్టేబుల్ వాంగ్మూలం...షాకింగ్..

తమిళనాడు పోలీసుల అమానుషత్వాన్ని అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంతో పోలుస్తూ నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు.

news18-telugu
Updated: June 30, 2020, 7:27 PM IST
George Floyds of India: తమిళనాడు లాకప్ డెత్ కేసులో లేడీ కానిస్టేబుల్ వాంగ్మూలం...షాకింగ్..
జయరాజ్, బెనిక్స్
  • Share this:
త‌మిళ‌నాడులో తండ్రీకొడుకులు జ‌య‌రాజ్‌, బెనిక్స్‌ క‌స్ట‌డీ డెత్ కేసులో కీల‌క మలుపు వెలుగు చూసింది. జయరాజ్ అతని కుమారుడు జె బెనిక్స్, జూన్ 19 న అరెస్టు చేసిన తరువాత రాత్రంతా లాఠీలతో సతంకుళం పోలీస్ స్టేషన్లో కొంతమంది సిబ్బంది దాడి చేశారని, ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ కోవిల్పట్టి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. అయితే ఈనెల 19న రాత్రంతా పోలీసులు వీరిద్దరిని తీవ్రంగా హింసించారని ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు తమ రిపోర్టులో షాకింగ్ విషయాలను వెల్లడించారు. వారి ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారని తెలిపారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని విచారించనున్నట్లు ఇప్పటికే తమిళనాడు హైకోర్టు ప్రకటించింది. తమిళనాడు పోలీసుల అమానుషత్వాన్ని అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంతో పోలుస్తూ నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు.

మరోవైపు ట్యుటికోర‌న్ పోలీసులు న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో జూన్ 19న‌ వారు నిర్వ‌హించే మొబైల్ దుకాణం ముందు ర‌ద్దీ ఉంద‌ని, దీంతో వారిపై పోలీసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా తండ్రీకొడుకులు ఎదురు తిరిగిన‌ట్లు పేర్కొన్నారు. కానీ తాజాగా బ‌య‌ట‌ప‌డ్డ సీసీటీవీ ఫుటేజీలో దుకాణం ముందు ఎలాంటి ర‌ద్దీ లేదు.

ఫోన్‌లో మాట్లాడుతున్న జ‌య‌రాజ్ పోలీసులు పిల‌వ‌డంతో వారి దగ్గ‌రకు వెళ్లాడు. అత‌ని వెన‌కాలే కొడుకు కూడా వెళ్లాడు. పోలీసులు అహంకారంతో దురుసుగా మాట్లాడిన‌ట్లు స్థానికులు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ వాళ్లు పోలీసుల‌కు స‌హ‌కరించారే త‌ప్ప ఎలాంటి బెదిరింపుల‌కు పాల్ప‌డ‌లేద‌ని సీసీటీవీలో స్ప‌ష్ట‌మ‌వుతోంది. అక్క‌డ ఘ‌ర్ష‌ణ జ‌రిగిన ఆన‌వాళ్లు కూడా లేవు.

పోలీసులు బెనిక్స్ తండ్రిని వాహ‌నంలో తీసుకు వెళుతుంటే అత‌డి కుమారుడు ఆ వాహ‌నాన్ని అనుస‌రించాడు. సీసీటీవీలో వారు స్వంతంగా గాయ‌ప‌ర్చుకున్నట్లు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డంతో వారికి వారే స్వ‌తాహాగా గాయాలు చేసుకున్నార‌న్న వాద‌నలోనూ నిజం లేద‌ని తేలింది. ఇక పోలీస్ స్టేష‌న్‌కు చేరుకునేస‌రికి పోలీసులు తన తండ్రిని దారుణంగా కొట్ట‌డాన్ని బెనిక్స్ గ‌మ‌నించాడు. దీంతో అడ్డుకోబోయిన బెనిక్స్‌ను సైతం అదుపులోకి తీసుకుని దారుణంగా హింసించారు.

దీంతో జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న స‌మ‌యంలోనే తండ్రీకొడుకులిద్ద‌రూ ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై ఇద్ద‌రు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు, ఇద్ద‌రు పోలీసుల‌ను స‌స్పెండ్ చేయ‌గా మ‌రో 15 మందిని బ‌దిలీ చేశారు. ప్ర‌స్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు
First published: June 30, 2020, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading