ఇదేం కరువురా నాయనా..? ఏకంగా 3200 వయాగ్రా మాత్రలను విమానంలో అమెరికాకు తీసుకెళ్లాడు.. కానీ..

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాకు వెళ్లిన ఓ భారతీయుడు చికాగా విమానాశ్రయంలో ఓ వింత పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3200 వయాగ్రా మాత్రలను తన బ్యాగులో పెట్టుకుని వెళ్లాడు. అడ్డంగా బుక్కయ్యాక వాటిని ఎందుకు తీసుకొచ్చావని అడిగితే..

 • Share this:
  అది అమెరికాలోని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం. భారత్ నుంచి అప్పుడే ఓ విమానం అక్కడకు చేరుకుంది. అందులోంచి వందల సంఖ్యలో ప్రయాణికులు దిగి విమానాశ్రయం లోపలికి చేరుకున్నారు. బ్యాగేజ్ చెకింగ్ జరుగుతోంది. ఇంతలో ఓ వ్యక్తికి సంబంధించిన బ్యాగ్ లో కట్టలు కట్టలుగా కొన్ని ప్యాకింగ్ పార్శిల్స్ కనిపించాయి. కస్టమ్స్ అధికారులు అవేంటా అని అనుమానంతో వాటిని ఓపెన్ చేసిచూశారు. అంతే ఒక్కసారిగా ఆ కస్టమ్స్ అధికారులు అవాక్కయ్యారు. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో వయాగ్రా పిల్స్ ఆ పార్శిల్స్ లో ఉన్నాయి. అన్నింటినీ ఓపిగ్గా లెక్కిస్తే మొత్తం 3200 వయాగ్రా పిల్స్ గా లెక్కతేలాయి. వీటన్నింటినీ భారత్ నుంచి అమెరికాకు ఎందుకు తెస్తున్నావని అడిగితే, అతడు చెప్పిన సమాధానం విని మరింత షాకయ్యారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.

  అమెరికాకు వెళ్లిన ఓ భారతీయుడు చికాగా విమానాశ్రయంలో ఓ వింత పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3200 వయాగ్రా మాత్రలను తన బ్యాగులో పెట్టుకుని వెళ్లాడు. వీటి విలువ దాదాపుగా 69 లక్షల రూపాయలు ఉంటుంది. అయితే అమెరికా చట్టాల ప్రకారం విదేశాల్లో తయారయిన మెడిసిన్స్ ను ఆ దేశంలోకి ఇతర దేశాల పౌరులు వెంట తెచ్చుకోవడానికి వీల్లేదు. కచ్చితంగా అవే వాడాలన్న నిబంధన ఉంటే ఆ మేరకు మెడికల్ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. అయితే ఆ వయాగ్రా మాత్రల విషయంలో మాత్రం మనోడు అడ్డంగా బుక్కయ్యాడు.

  ఇన్ని వేల మాత్రలను అమెరికాలో ఎవరికోసం తీసుకెళ్తున్నావు? ఎందుకు తీసుకెళ్తున్నావు? అని కస్టమ్స్ అధికారులు ఆ భారతీయుడిని ప్రశ్నించారు. దానికి అతడు తాపీగా ’నా స్నేహితుల కోసం తీసుకెళ్తున్నాను. వారికి ఇవి చాలా అవసరం అన్నారు‘ అని అన్నాడు. వాళ్లెవరు? ఎక్కడ ఉంటారు? అన్న వివరాలేవీ అతడు చెప్పకపోవడంతో ఆ వయాగ్రా పిల్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదనీ, ఆ వయాగ్రా మాత్రలకు సంబంధించి మెడికల్ బిల్లులు కూడా లేవని, అందుకే అతడిని అదుపులోకి తీసుకున్నామని చికాగో విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ భారతీయుడి పేరు మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.
  Published by:Hasaan Kandula
  First published: