సిక్కిం రాష్ట్రంలోని భారత్- చైనా సరిహద్దులో దాదాపు 3 వేల మంది టూరిస్టులు మంచులో చిక్కుక్కుపోయారు. పెద్ద ఎత్తున కురుస్తున్న మంచు కారణంగా రోడ్లు మార్గం మొత్తం మూసుకుపోయింది. దీంతో దాదాపు 400 వాహనాలు మంచులో చిక్కుక్కుపోయాయి. వీరిని కాపాడిన భారత సైన్యం... హుటాహుటీన సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వీరికి కావల్సిన ఆహారం, దుస్తులతో పాటు వసతి సౌకర్యాన్ని కల్పించారు భారత సైనికులు. టూరిస్ట్‌లకు వసతి కల్పించడం కోసం ఆర్మీ జవాన్లు తన బ్యారక్‌లను ఖాళీ చేసి ఇవ్వడం విశేషం.
పర్యాటకుల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా రగ్గులతో పాటు అవసరమైన మందులు కూడా పంపిణీ చేసింది ఆర్మీ. సిక్కిం రాష్ట్ర సరిహద్దులో ఉన్న నాథులా మార్గంలో భారీగా మంచు కురవడంతో రహదారులన్నీ మూసివేశారు. 1500 మంది పర్యాటకులకు 17 మైలురాయి దగ్గర వసతి ఏర్పాటు చేసిన భారత సైనికులు... మిగిలిన వారి కోసం 13 మైలు దగ్గర బస ఏర్పాటు చేశారు. బ్యారక్‌లు పూర్తిగా నిండిపోవడంతో రెండు సీట్ల జేసీబీలు, డజన్ల సంఖ్యలో ఉన్న బీఆర్‌వీలను వాడి రోడ్డపై పడిన మంచును తొలగిస్తున్నారు. నాథులా మార్గాన్ని సందర్శించి వస్తున్న సమయంలో తీవ్రమైన మంచు కురవడంతో వీరంతా చిక్కుక్కుపోయినట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.